గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మార్చి 2018, శుక్రవారం

యథా సునిపుణ: సమ్యక్! పరదోషే క్షణే రతః! .. .. .. మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో.యథా సునిపుణ: సమ్యక్! పరదోషే క్షణే రతః! 
తథాచేన్నిపుణః స్వేషు! కోనముచ్యేత బంధనాత్!!
చ.ఇతరుల దోషముల్ వెదక నెవ్వరు కల్గుదురట్టివారు తా
సతతము వారి దోషములు చక్కఁగ గాంచి చెలంగిరేని స
న్నుతమగు సత్పథంబున గనుంగొన జాలుదురయ్య ముక్తి. సం
స్తుతమతిమంతులెప్పుడును దోషములెంచరు సుస్వభావులై.
భావము.ఇతరుల దోషముల నెంచుట లో చూపు సహజ చాకచక్యమును,తెలివినీ తమ 
దోషములను గుర్తించుటలో వినియోగించినచో వాడు సంసార బంధనమునుండి విముక్తి 
చెందును.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరు గ్రహించ వలసిన మంచి సందేశము. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.