గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మార్చి 2018, సోమవారం

నతవిధిద్వయవృత్తములు. రవన. శ్రీ వల్లభవఝల అప్పలనరసింహ మూర్తి.

 జైశ్రీరామ్.
నతవిధిద్వయవృత్తములు.
రవన. శ్రీ వల్లభవఝల అప్పలనరసింహ మూర్తి.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.జ.భ.త.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఇసుక పంట పండెనమ్మ!యెగిరి విక్రయించు!చుండ్రి!ఇంకె జలం!పాతళంబు!
మసియె!దక్కు!చిట్ట చివ్ర!మగతనంబు!తెల్వి!చాట!మంకుతనం!వీడరైరి!
బుసలుగొట్టు!నాగులైరి!పొగరుబూని!యెల్లవార్లు!పొంకమదే!జాతిమాపు!
వెసులుబాటులేదు!చూడ!బిగువు తగ్గు రోజులొచ్చు!బింకమ!తిండేది?రేపు

నతవిధివృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.జ.భ.త.గల.గణములు.యతులు.10;19.
ప్రాసనీమముగలదు.
ఎగిరి!విక్రయించుచుండ్రి!ఇసుకపంట!పండెనమ్మ!యింకె!జలం!పాతళంబు!
మగతనంబుదెల్విచాట!మసియెదక్కు!చిట్టచివ్ర!మంకుతనం!వీడరైరి!
పొగరుబూని!యెల్లవార్లు!బుసలుగొట్టు!నాగులైరి!పొంకమదే?జాతిమాపు!
బిగువుతగ్గు!రోజులొచ్చు!వెసులుబాటు!లేదుచూడ!బింకమ!తిండేది?రేపు!

1.గర్భగత"-గతికాద్వయవృత్తములు.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
1.ఇసుక పంట పండెనమ్మ!        2.ఎగిరి విక్రయించు చుండ్రి!
  మసియె దక్కు చిట్ట చివ్ర!           మగతనంబు! దెల్వి చాట!
  బుసలుగొట్టు నాగులైరి!             పొగరుబూని!యెల్లవార్లు!
  వెసులుబాటు!లేదు?జూడ!        బిగువుతగ్గు!రోజులొచ్చు!

2.గర్భగత"-భ్రమర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.త.గల.గణములు.వృ.సం.167.ప్రాసగలదు.
ఇంకె!జలం!పాతళంబు!
మంకుతనం!వీడరైరి!
పొంకమదే!జాతి మాపు!
బింకమ! తిండేది?రేపు!

3.గర్భగత"-నరజయుగళీ"-ద్వయ,వృత్తములు.
ధృతిఛందము.న.ర.జ.న.ర.జ.గణములు.యతి10వ.యక్షరముప్రాసగలదు .
 1.ఇసుక పంట!పండెనమ్మ!యెగిరి విక్రయించుచుండ్రి!                             
మసియె దక్కు!చిట్టచివ్ర!మగతనంబుదెల్విచాట!
బుసలుగొట్టు!నాగులైరి!పొగరుబూని!యెల్లవార్లు!
వెసులుబాటు!లేదుజూడ!బిగువు తగ్గు రోజులొచ్చు!
2.ఎగిరి!విక్రయించుచుండ్రి!ఇసుక పంట పండె!నమ్మ!
    మగతనంబు!దెల్విదెల్విచాట!మసియెదక్కు!చిట్ట చివ్ర!
   పొగరుబూని!యెల్లవార్లు!బుసలుగొట్టు!నాగులైరి!
   బిగువు!తగ్గు!రోజులొచ్చు!వెసులుబాటులేదు!జూడ!

4.గర్భగత"-విక్రయ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.భ.త.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసగలదు.
ఎగిరి!విక్రయించుచుండ్రి!ఇంకె!జలం!పాతళంబు!
మగతనంపు!దెల్విచాట!మంకుతనం!వీడరైరి!
పొగరుబూని!యెల్లవార్లు!పొంకమదే!జాతి మాపు!
బిగువు!తగ్గు రోజులొచ్చు!బింకమ!తిండేది?రేపు!

5.గర్భగత"-నతబిగి"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.భ.స.జ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసగలదు.
ఇంకె!జలం!పాతళంబు!ఇసుక పంట!పండెనమ్మ!
మంకుతనం!వీడరైరి!మసియె!దక్కు!చిట్టచివ్ర!
పొంకమదే!జాతి మాపు!బుసలుగొట్టు!నాగులైరి!
బింకమ!తిండేది?రేపు!వెసులుబాటు!లేదుజూడ!

6.గర్భగత"-బుసనాగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.భ.స.జ.భ.స.జ.లగ.గణములుయతులు.10,18,
ప్రాసనీమముగలదు.
ఎగిరి!విక్రయించుచుండ్రి!ఇంకె!జలం!పాతళంబు!ఇసుకపంట!పండెనమ్మ!
మగతనంబుదెల్విచాట!మంకుతనం!వీడరైరి!మసియె!దక్కు!చిట్టచివ్ర!
పొగరుబూనియెల్లవార్లు!పొంకమదే?జాతిమాపు!బుసలుగొట్టునాగులైరి!
బిగువుతగ్గు!రోజులొచ్చు!బింకమ!తిండేది?రేపు!వెసులుబాటులేదుజూడ!

7.గర్భగత"-భూద్రోహక"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.భ.స.జ.భ.స.జ.గల.గణములు.యతులు.9,18,
ప్రాసనీమముగలదు.
ఎగిరి!విక్రయించుచుండ్రి!యిసుకపంట!పండెనమ్మ!యింకె!జలం!పాతళంబు!
మగతనంబుదెల్విచాట!మసియె!దక్కు!చిట్టచివ్ర!మంకుతనం!వీడరైరి!
పొగరుబూనియెల్లవార్లు!బుసలుగొట్టు!నాగులైరి!పొంకమదే!జాతిమాపు!
బిగువు!తగ్గు!రోజులొచ్చు!వెసులుబాటులేదు!జూడ!బింకమ!తిండేది?రేపు!

స్వస్తి..
మూర్తి. జుత్తాడ.
జైహింద్..
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఇన్ని రకముల వృత్తములను మాకందిస్తున్న సరస్వతీ పుత్రులు శ్రీ వల్లభవఝులవారి ప్రతిభ శ్లాఘనీయము. గర్భగత భ్రమర వృత్తము అద్భుతముగా నున్నది. ఈ నిధులకు స్వంతమైన శ్రీ చింతావారు ధన్యులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.