గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మార్చి 2018, ఆదివారం

వెసనుడు, యాగఫల, గర్భ బీజాపూర్ణ వృత్తము రచన;-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
వెసనుడు, యాగఫల, గర్భ బీజాపూర్ణ వృత్తము
రచన;- వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

బీజాపూర్ణ వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.

రసనుముక్తినందగా!రామరామ!యనుమి!చాలు!రాజితుండవౌదు భూతలిన్!
వెసనుగొల్వు రామునిం!వేమరంబుపడకు జీవ!వేజపించి!ముక్తి నందుమా!వెసలు!పాపదోషముల్ప్రేమ పాత్రుడగుదువీవు!బీజపూర్ణశక్తి వంతతన్!
వసతిశోభజేకురుం!భాములెల్ల దరికిరావు!వాజపేయ!కీర్తి వాటిలన్!

1 గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.ప్రాసగలదు.
రసను ముక్తి నందగా!
వెసను గోల్వురామునిన్!
వెసలు!పాప దోషముల్!
వసతి!శోభ జేకురున్!

2.గర్భగత"-భ్రమర"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379.ప్రాసగలదు.
రామరామ!యనుమి చాలు!
వేమరంబు పడక!జీవ!
ప్రేమపాత్రుడగుదు వీవు!
భాములెల్ల దరికి రావు!

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
రాజితుండవౌదు!భూతలిన్!   
వేజపించి!ముక్తి నందుమా!
బీజపూర్ణశక్తి వంతతన్!
వాజపేయ!కీర్తి వాటిలన్!

4.గర్భగత"-వేమరు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.న.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
రసను!ముక్తినందగా!రామరామ యనుమి!చాలు!
వెసనుగొల్వు!రామునిం!వేమరంబు పడకుజీవ!
వెసలు !పాపదోషముల్!ప్రేమపాత్రుడగుదు!వీవు!
వసతి శోభ జేకురుం!భాములెల్ల!దరికి  !

5.గర్భగత"-పాత్రతా"-వృత్తము.
ధృతిఛందము.ర.న.జ.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు..
రామరామ!యనుమి చాలు!రాజితుండవౌదు!భూతలిన్!
వేమరంబు పడకు!జీవ!వేజపించి ముక్తి నందుమా!
ప్రేమపాత్రుడగుదు!వీవు!బీజపూర్ణశక్తివంతతన్!
భాములెల్ల!దరికి రావు!వాజపేయ కీర్తి!వాటిగగగు

6.గర్భగత"-రాజీవా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
రామరామ!యనినచాలు!రాజితుండవౌదు!భూతలిం!రసను ముక్తినందగా!
వేమరంబుపడకు!జీవ!వేజపించి!ముక్తినందుమా!వెసనుగొల్వు!రామునిన్!
ప్రేమపాత్రుడగుదు!వీవుబీజపూర్ణశక్తివంతతం!వెసలు పాపదోషముల్!
భాములెల్ల!దరికిరావు!వాజపేయ!కీర్తివాటిలం!వసతిశోభ!జేకురున్!

7.గర్భగత"-రజరోన్నర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
రాజితుండవౌదు!భూతలిం!రసను ముక్తినందగా!
వేజపించి!ముక్తినందుమా!వెసను గొల్వు!రామునిన్!
బీజపూర్ణశక్తివంతతం!వెసలు!పాపదోషముల్!
వాజపేయ!కీర్తివాటిలం!వసతిశోభ!జేకురున్!

8.గర్భగత"-సురశోభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.య.జ.న.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
రాజితుండవౌదు!భూతలిం!రసనుముక్తినందగా!రామరామయనిన చాలు!
వేజపించి!ముక్తినందుమా!వెసనుగొల్వు!రామునిం!వేమరంబుపడకు!జీవ!
బీజపూర్ణ!శక్తివంతతం!వెసలుపాపదోషముల్!ప్రేమపాత్రుడగుదు వీవు!
వాజపేయ!కీర్తివాటిలం!వసతిశోభ!జేకురుం!భాములెల్ల !దరికి రావు!

9.గర్భగత"-వెసనుడు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.ర.లగ.గణములు.యతి.10.వ..యక్షరము.
ప్రాసనీమముగలదు.
రామరామ!యనుమి చాలు!రసను ముక్తినందగా!
వేమరంబు!పడకు జీవ!వెసనుగొల్వు రామునిన్!
ప్రేమపాత్రుడగుదు వీవు!వెసలు పాపదోషముల్!
భాములెల్ల దరికిరావు!వసతిశోభ!జేకురున్!

10.గర్భగత"-యాగఫల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.న.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
రామరామ!యనుమిచాలు!రసను ముక్తినందగా!రాజితుండవౌదు!భూతలిన్!
వేమరంబు!పడకుజీవ!వెసనుగొల్వు!రామునిం!వేజపించి!ముక్తినందుమా!
ప్రేమపాత్రు!డగుదువీవు!వెసలుపాపదోషముల్!బీజపూర్ణశక్తివంతతన్!
భాములెల్ల!దరికిరావు!వసతిశోభ!జేకురుం!వాజపేయకీర్తి!వాటిలన్!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.