గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మార్చి 2018, మంగళవారం

పార్ధమృగ్య,బలిమిస్వేచ్చ్ఛబంధనా,గర్భ వక్రజ్ఞాన వృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
పార్ధమృగ్య,బలిమిస్వేచ్చ్ఛబంధనా,గర్భ వక్రజ్ఞాన వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

               "-వక్రజ్ఞాన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.భ.స.స.జ.జ.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
వెలవెలబోయె!భారతి విధుషీమణి!వేదవేద్య!పెరంబడె!ఖ్యాతటంచున్?
తెలుగును!వాడరేమని?తిధి,వారము!తెల్యదేల?తెరంగెటుమారె! నేలన్?
బలిగొనె!స్వేచ్ఛబంధన!పదిలంబెటు?చూడ!లేదు!పరార్ధము మృగ్యమాయెన్!
కులములపేర!నైచ్యత!కుదురెన్నడుకల్గు?నెంచ!కురూపిగ!నీతి! నిల్చెన్!

1.గర్భగత"-చంపవృత్తము.
బృహతీఛందము.న.జ.భ.గణములు.వృ.సం.432.ప్రాసగలదు.
వెలవెలబోయె!భారతి!
తెలుగును!వాడరేమని?
బలిగొనె!స్వేచ్ఛ ?బంధన!
కులములపేర !నైచ్యత!

2.గర్భగత"-గతిమా"-వృత్తము.
బృహతీఛందము.స.స.జ.గణములు.వృ.సం.348.ప్రాసగలదు.
విధుషీమణి!వేదవేద్య!
తిధి,వారము!తెల్యదేల?
పదిలంబెటుచూడ?లేదు!
కుదురెన్నడు?కల్గు నెంచ!

3.గర్భగత"-మదపెంపు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.జ.గగ.గణములు.వృ.సం.46.ప్రాసగలదు.
పెరంబడె!ఖ్యాతటంచున్!
తెరంగెటు?మారె!నేడున్!
పరార్ధము!మృగ్యమాయెన్!
కురూపిగ!  నీతి నిల్చెెన్!

4.గర్భగత"-భద్రదూర"-వృత్తము.
ధృతిఛందము.న.జ.భ.స.స.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వెలవెలబోయె!భారతి!విధుషీమణి!వేదవేద్య!
తెలుగును!వాడరేమని?తిధి,వారము!తెల్యదేల?
బలిగొనె స్వేచ్ఛ!బంధన!పదిలంబెటు?చూడ లేదు?
కులముల పేర!నైచ్యత!కుదురెన్నడు?కల్గు!నెంచ?

5.గర్భగత"-కుదురొనరని"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.జ.జ.జ.గగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
విధుషీమణి!వేదవేద్య!పెరంబడె!ఖ్యాతటంచున్?
తిధి,వారము!తెల్యదేల?తెరంగెటు?మారె!నేడున్?
పదిలంబెటుచూడ?లేదు!పరార్ధముమృగ్యమాయెన్!
కుదురెన్నడు?కల్గునెంచ?కురూపిగ!నీతి నిల్చెన్!

6.గర్భగత"-వెరతెరంగు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.జ.జ.త.న.ర.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
విధుషీమణి!వేదవేద్య!పెరంబడె!ఖ్యాతటంచుం?వెలవెలబోయె!భారతి!
తిధి,వారము!తెల్యదేల?తెరంగెటు?మారె!నేడుం?తెలుగును!వాడరేమని?
పదిలంబెటుచూడ?లేదు!పరార్ధము!మృగ్యమాయెం!బలిగొనె స్వేచ్ఛ!బంధన!
కుదురెన్నడుకల్గు?నెంచ!కురూపిగ!నీతి!నిల్చెం!కులముల పేర! నైచ్యత?

7.గర్భగత"-పెరగమ్య"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.త.న.ర.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పెరంబడె!ఖ్యాతటంచుం?వెలవెలబోయె!భారతి!
తెరంగెటు?మారె!నేడుం?తెలుగును!వాడరేమని?
పరార్ధము!మృగ్యమాయెం? బలిగొనె!స్వేచ్ఛ! బంధన!
కురూపిగ!నీతినిల్చెం?కులములపేర! నైచ్యత!

8.గర్భగత"-పరార్ధమృగ్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.త.న.ర.న.జ.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
పెరంబడె!ఖ్యాతటంచుం?వెలవెలబోయె!భారతి!విధుషీమణి!వేదవేద్య!
తెరంగెటు?మారె నేడుం?తెలుగును!వాడరేమని?తిధి,వారము!తెల్యదేల?
పరార్ధము!మృగ్యమాయెం!బలిగొనెస్వేచ్ఛ!బంధన!పదిలంబెటుచూడ!లేదు!
కురూపిగ!నీతి!నిల్చెం?కులములపేర!నైచ్యత!కుదురెన్నడు?కల్గు!నెంచ?

9.గర్భగత"-బలిమినీ"-వృత్తము.
ధృతిఛందము.స.స.జ.న.జ.భ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
విధుషీమణి!వేదవేద్య!వెలవెలబోయె?భారతి!
తిధి,వారము,తెల్యదేల?తెలుగును!వాడరేమని?
పదిలంబెటుచూడ?లేదు!బలిగొనె?స్వేచ్ఛబంధన!
కుదురెన్నడు?కల్గు?నెంచ?కులములపేర!నైచ్యత!

10.గర్భగత"-స్వేచ్ఛబంధనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.న.జ.భ.జ.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
విధుషీమణి!వేదవేద్య!వెలవెలబోయె!భారతి!పెరంబడె!ఖ్యాతటంచున్!
తిధి,వారము,తెల్యదేల?తెలుగును!వాడరేమని?తెరంగెటు?మారె నేడున్?
పదిలంబెటుచూడ?లేదు!బలిగొనెస్వేచ్ఛ?బంధన!పరార్ధముమృగ్యమాయెన్!
కుదురెన్నడు?కల్గునెంచ?కులములపేర!నైచ్యత!కురూపిగ!నీతి!నిల్చెన్!

స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.