గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మార్చి 2018, శుక్రవారం

గర్భనమత్రియానద్వయ వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
గర్భనమత్రియానద్వయ వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

            నమత్రియానద్వయవృత్తములు.
ఉత్కృతిఛందము.న.మ.య.న.మ.య.న.మ.గగ.గణములు.
.యతులు10,19.ప్రాసనీమముగలదు.
1.జగములేలే!జంగమయ్యా!జగతికే!తండ్రీవుకాగా!జనకుడేడీ?నీకంటే!
స్వగుణసామ్యంబేర్పనెంచే!వగపు!చావుంపుట్టుకుండే!చనెడి!జీవులెంచంగన్!
వగరుబోతుల్నిచ్ఛబల్కం!ప్రగతియేమైనా!సరంటే!పనిగబల్కం!దోషంబౌ?
సుగమమౌనే?యెంచిచూడం!సుగతిలేదా?పార్వతీశా!సునిశితంబుంనేర్పన్రా!

భావము:-జగములేలే జంగమదేవరుడు,జగతికే!తండ్రియైన,జగన్నాయకునికి
తండ్రెవరని?యోచింపతగదు!అదిదోషము.యద్భావం!తద్భవతి"-యన్నట్లు!
చావుపుట్టుకలుగల జీవరాశికితండ్రియుండక తప్పదుఆదిపురుషుడాయననే!
అతనికి!తండ్రియుండు,నవకాశమేది!తెలిసీతెలియకతమయాధిపత్యంపెంపు
జేసికొనుటకు!యిచ్ఛవచ్చినట్లుబల్కుట,సమంజసమా!కాదు.ప్రగతియేమైనా!
సరంటే!దోషము.ఓపార్వతీశా!సున్నితముగా,అట్టివారి వాచాదోషము
లెక్కింపక!మంచిగా నూహింపజేసి!మోక్షమును,ప్రసాదించుము.

2.జగతికే!తండ్రీవుకాగా!జగములేలే!జంగమయ్యా!జనకుడేడీ!నీకంటే!
వగపు,చావుం,పుట్టుకుండే!స్వగుణసామ్యంబేర్పనెంచేచనెడిజీవులెంచంగన్!
ప్రగతి!యేమైనా!సరంటే!వగరుబోతుల్నిచ్ఛబల్కం!పనిగబల్కన్దోషంబౌ?
సుగతిలేదా?పార్వతీశా!సుగమమౌనే?యెంచిచూడం!సునిశితంబున్నేర్పన్రా

1.గర్భగత"గవినుతద్వయ"-వృత్తము.
బృహతీఛందము.న.మ.య.గణములు.వృ.సం.72.ప్రాసగలదు.
1జగములేలే!జంగమయ్యా!     2.జగతికే?తండ్రీవె!కాగా!
స్వగుణసామ్యంబేర్పనెంచే!         వగపు,చావుం!పుట్టుకుండే!
వగరుబోతుల్నిచ్ఛ బల్కన్!          ప్రగతియేమైనా?సరంటే!
సుగమమౌనే?యెంచిచూడన్!     సుగతిలేదా?పార్వతీశా!

2.గర్భగత"-నీలికంఠ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.గగ.గణములు.వృ.సం.24.ప్రాసగలదు.
జనకుడేడీ?నీకంటే!
చనెడి!జీవులెంచంగన్?
పనిగ బల్కం!దోషంబౌ!
సునిశితంబున్నేర్పన్రా!

3.గర్భగత"-న.మ.యా"-వృత్తము.
ధృతిఛందము.న.మ.య.న.మ.య.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జగములేలే?జంగమయ్యా!జగతికే?తండ్రీవె!కాగా!
స్వగుణసామ్యంబేర్ప!వగపు,చావుం!పుట్టుకుండే?
వగరుబోతుల్నిచ్ఛబల్కం?ప్రగతియేమైననా?సరంటే?
సుగమమౌనే?యెంచి!చూడం!సుగతి లేదా?పార్వతీశా!

4.గర్భగత"-వగపుల"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.య.న.ర.గగ.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జగతికే?తండ్రీవె!కాగా!జనకుడేడీ!నీకంటే?
వగపు,చావుం,పుట్టుకుండే?చనెడు!జీవులెంచంగన్?
ప్రగతి!యేమైనా?సరంటే!పనిగబల్క!దోషంబౌ!
సుగతి!లేదా?పార్వతీశా!సునిశితంబు!నేర్పం!రా!

5.గర్భగత"-జగత్పితా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.య.న.మ.త.స.త.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జగతికే?తండ్రీవె!కాగా!జనకుడేడీ?నీకంటే!జగములేలే!జంగమయ్యా!
వగపు,చావుం,పుట్టుకుండే?చనెడుజీవులెంచంగం!స్వగుణసామ్యంబేర్పనెంచే
ప్రగతియేమైనా!సరంటే?పనిగబల్క!దోషంబౌ!వగరుబోతుల్నిచ్ఛబల్కన్?
సుగతిలేదా?పార్వతీశా!సునిశితంబు!నేర్పంరా!సుగమమౌనే?యెంచిచూడన్!

6.గర్భగత"-సునిశిత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.జ.స.త.గగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జనకుడేడీ?నీకంటే!జగములేలే?జంగమయ్యా!
చనెడు!జీవులెంచంగం?స్వగుణసామ్యంబేర్పనెంచే!
పనిగబల్క!దోషంబౌ! వగరుబోతుల్నిచ్ఛబల్కన్?


సునిశితంబు!నేర్పన్రా!సుగమమౌనేయెచిచూడనన్!*

7.గర్భగత"-జనకా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.త.స.త.త.స.త.గగగగణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జనకుడేడీ?నీకంటే!జగములేలే!జంగమయ్యా!జగతికే?తండ్రీవె!కాగా!
చనెడి!జీవులెంచంగం?స్వగుణసామ్యంబేర్ప!నెంచే!వగవ,చావ్న్పుట్టుకుండే!
పనిగ!బల్క!దోషంబౌ!వగరుబోతుల్నిచ్ఛబల్కం?ప్రగతి!యేమైనా?సరంటే!
సునిశితంబు!నేర్పం!రా!సుగమమౌనే?యెంచి చూడం!సుగతిలేదా!పార్వతీశా!

స్వస్తి.


జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.