గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, మార్చి 2018, ఆదివారం

కలిధర్మ,అసత్య,నతనుత,గర్భ చరధర్మవృత్తము. రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
కలిధర్మ,అసత్య,నతనుత,గర్భ చరధర్మవృత్తము.
రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
చరధర్మవృత్తము.
ఉత్కృతిఛందము.స.త.ర.ర.జ.భ.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కలినైజం!చూడలేనటుల్!కంటిగుడ్డ!చుట్టితీవు!కనవవేమి?ధర్మ దేవతా!
విలువౌ!ధర్మంబుమాయగా!పెంట!జేయు!తీరుగాంచి!వినెదీవు!చూడకుండగన్
కలిలోనం!సత్యమేదనం?కంటకంబులంటజేసి!కనులుండి,చూడవైతివే!
పలికే!నర్మాలనెంచకం?పంటిపల్కు!నీతినెంచి!ప్రణుతిం!గనంగ!వైతివే

భావము:-కలికాలంతీరుచూడలేనట్లు!కంటికి!గుడ్డచుట్టితివి.ధర్మదేవతా!
చూడవెందులకు?అమూల్యమైనధరర్మం కనబడకుండ పెంటజేయుజనులు
తీరుగాంచి చూడ మాని,వింటూవుంటావు.కలికాలంలో!సత్యమేదంటు?
ముళ్ళనంటించి,కనులుండి చూడవైతివి.అబద్ధపుమాటలను,శోధించుట
మాని,నీతివాక్కులుగా!భావించి!ప్రణుతులందెదవెందులకు?

1.గర్భగత:-వేదాశ్రి: వృత్తము.
బృహతీఛందము.స.త.ర.గణములు.వృ.సం.164.ప్రాసగలదు.
కలినైజం!చూడలేనటుల్!
విలువౌ!ధర్మంబు మాయగా!
కలిలోనన్!సత్యమేదనన్?
పలికే!నర్మాల నెంచకన్!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
కంటిగుడ్డ చుట్టి తీవు!
పెంటజేయు!తీరుగాంచి!
కంటకంబులంట!జేసి!
పంటిపల్కు!నీతినెంచి!

3.గర్భగత"-సుఖజీవన"-వృత్తము.
బృహతీఛందము.స.జ.ర.గణములు.వృ.సం.172.ప్రాసగలదు.
కనవేమి?ధర్మదేవతా!
వినెదీవు!చూడకుండగన్!
కనులుండి!చూడవైతివే?
ప్రణుతిం!గనంగ నేమొకో?

4.గర్భగత"-తేలియాడు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.త.ర.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలినైజం!చూడలేనటుల్?కంటి గుడ్డ చుట్టితీవు!
విలువవౌ!ధర్మంబు!మాయగా!పెంటజేయుతీరు గాంచి!
కలిలోనం!సత్యమేదనన్?కంటకంబులంటజేసి?
పలికే!నర్మాల నెంచకం?పంటిపల్కు!నీతినెంచి!

5.గర్భగత"-స్వభావినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.జ.ర.లగ.గణములు.యతి.9.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
కంటిగుడ్డ!చుట్టితీవు!కనవేమి?ధర్మదేవతా!
పెంటజేయు!తీరుగాంచి!వినెదీవు!చూడకుండగన్!
కంటకంబు లంటజేసి!కనులుండి!చూడవైతివే?
పంటిపల్కు!నీతినెంచి!ప్రణుతిం!గనంగ నేమొకో?

6.గర్భగత"-కలినైజ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.జ.ర.జ.య.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కంటిగుడ్డ!చుట్టితీవు!కనవేమి?ధర్మదేవతా!కలినైజం!చూడలేనటుల్?
పెంటజేయుతీరుగాంచి!వినెదీవుచూడకుండగం?విలువౌ!ధర్మంబు!మాయగా!
కంటకంబులంటజేసి!కనులుండి!చూడవైతివే!కలిలోనం!సత్యమేదనన్?
పంటిపల్కు నీతినెంచి!ప్రణుతింగనంగ!నేమొకో?పలికేనర్మాలనెంచకన్?

7.గర్భగత"-జగన్మాయా"-వృత్తము.
ధృతిఛందము.స.జ.ర.స.త.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కనవేమి?ధర్మదేవతా!కలినైజం!చూడలేనటుల్?
వినెదీవు!చూడకుండగం?విలువౌ!ధర్మంబు!మాయగా!
కనులుండిచూడవైతివే?కలిలోనం!సత్యమేదనన్?
ప్రణుతింగనంగ!నేమొకో?పలికేనర్మాలనెంచకనన్?

8.గర్భగత"-కలిధర్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.ర.స.త.ర.ర.జ.గల.గణములు.యతులు10,19.
ప్రాసనీమముగలదు.
కనవేమి?ధర్మదేవతా!కలినైజం!చూడలేనటుల్?కంటిగుడ్డచుట్టితీవు!
వినెదీవు!చూడకుండగం?విలువౌ!ధర్మంబు మాయగాపెంటజేయుతీరుగాంచి!
కనులుండి!చూడవైతివే!కలిలోనం!సత్యమేదనం?కంటకంబులంటజేసి!
ప్రణుతింగనంగ! నేమొకో?పలికేనర్మాలనెంచకం?పంటిపల్కు!నీతినెంచి!

9.గర్భగత"-అసత్య"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.య.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కంటిగుడ్డచుట్టితీవు!కలినైజం!చూడలేనటుల్?
పెంటజేయుతీరుగాంచి!విలువౌ!ధర్మంబు!మాయగా!
కంటకంబులంటజేసి!కలిలోనం!సత్యమేదనన్?
పంటిపల్కు!నీతినెంచి!పలికే!నర్మాలనెంచకన్?

10.గర్భగత"-నతనుత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.య.ర.జ.జ.ర.లగ.గణములు.యతులు.9,18,.
ప్రాసనీమముగలదు.
కంటిగుడ్డచుట్టితీవు!కలినైజంచూడలేనటుల్కనవవేమి?ధర్మదేవతా!
పెంటజేయు!తీరుగాంచి!విలువౌధర్మంబుమాయగా!వినెదీవు!చూడకుండగన్
కంటకంబులంటజేసి!కలిలోనం!సత్యమేదనం?కనులుండి!చూడవైతివే!
పంటిపల్కు!నీతినెంచి!పలికే!నర్మాలనెంచకం!ప్రణుతింగనంగ!నేమొకో?

 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.  
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కలియుగ నైజాన్ని గురించి ధర్మ దేవతను వివిధ వృత్తములలో ప్రశ్నించిన తీరు అద్భుతము గానున్నది. శ్రీ వల్లభవఝులవారికి శతాధి వందనములు .శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.