జైశ్రీరామ్.
మురియకు, చెడుకలి, పరస్వేచ్ఛా, గర్భ "ఉపకరి" వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
ఉపకరి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.న.న.న.న.న.న.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
చెరపకురా!చెడెదవు!సిరులకు!మురియకు!చెరగొనకు!పరస్వేచ్ఛన్!
కరివరదు!మదిగను!గరికల!చెరపకు!కరటుతనమది!తప్పౌ!
పరిమళ గంధముబలె!వరదుల దరినిలు!పరులకుపకరి వౌచున్!
సురలలరం!వెలుగుమ!సురభిళ!సుమసరి!సురధములొనర!కాంతిన్!
1.గర్భగత:-తెల్వరి"-వృత్తము.
బృహతీఛందము.న.జ.న.గణములు.వృ.సం.496.ప్రాసగలదు.
చెరపకురా!చెడెదవు!
కరివరదు!మదిగను!
పరిమళ!గంధము బలె!
సురలలరం!వెలుగుమ!
2.గర్భగత"-చతురిమ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.లల.గణములు.వృ.సం.256.ప్రాసగలదు.
సిరులకు!మురియకు!
గరికల!చెఱపకు!
వరదుల!దరినిలు!
సురభిళ!సుమసరి!
3.గర్భగత"-భుజగశిశురుత"-వృత్తము.
బృహతీఛందము.న.న.య.గణములు.వృ.సం.428.ప్రాసగలదు.
చెరగొనకు!పర స్వేచ్ఛన్!
కరటు తనమది తప్పౌ!
పరుల కుపకరి వౌచున్!
సురధము!లొనర!కాంతిన్!
4.గర్భగత"-వెలుగుమా"--వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.న.న.న.లల.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చెరపకురా!చెడెదవు!సిరులకు!మురియకు!
కరివరదు!మదిగను!గరికల!చెఱపకు!
పరిమళ!గంధము బలె!వరదుల!దరినిలు!
సురలలరం!వెలుగుమ!సురభిళ!సుమసరి!
5.గర్భగత"-నాగావళి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.న.న.నన.గగ.గణములు.యతి.9.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
సిరులకు!మురియకు!చెరగొనకు!పర స్వేచ్ఛన్!
గరికల!చెఱపకు! కరటుతనమది!తప్పౌ!
వరదుల దరి నిలు!పరులకుపకరి!వౌచున్!
సురభిళ!సుమసరి!సురధములొనర!కాంతిన్!
6.గర్భగత"-చెఱగొను"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.త.న.భ.లల.గణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
సిరులకు మురియకు!చెరగొనకు!పరస్వేచ్ఛం!చెరపకురా!చెడెదవు!
గరికల చెఱపకు!కరటుతనమది!తప్పౌ!కరివరదుని మదిగను!
వరదులదరి!నిలు!పరులకుపకరివౌచుం!పరిమళ!గంధముబలె!
సురభిళ!సుమసరి!సురధము లొనర!కాంతిం!సురలలరంవెలుగుమ!
7.గర్భగత"-కరటు"-వృత్తము.
ధృతిఛందము.న.న.య.న.జ.న.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చెరగొనకు!పరస్వేచ్ఛం!చెరపకురా!చెడెదవు!
కరటుతనమది!తప్పౌ!కరివరదుని!మదిగను!
పరులకుపకరి వౌచుం!పరిమళ!గంధముబలె!
సురధములొనర!కాంతిం!సురలలరం!వెలుగుమ!
8.గర్భగత"-మురియకు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.య.న.జ.న.న.న.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చెరగొనకు!పరస్వేచ్ఛం!చెరపకురా!చెడెదవు!సిరులకు!మురియకు!
కరటుతనమది!తప్పౌ!కరి వరదుని!మదిగను!గరికల!చెరపకు!
పరుల!కుపకరి!వౌచుం!పరిమళ!గంధముబలె!వరదుల దరి నిలు!
సురధము లొనర!కాంతిం!సురలలరం!వెలుగుమ!సురభిళ!సుమ!సరి!
9.గర్భగత"-చెడుకలి"-వృత్తము.
అత్యష్టీవృత్తము.న.న.న.న.భ.లల.గణములు.యతి9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సిరులకు!మురియకు!చెెరపకురా!చెడెదవు!
గరికల!చెరపకు!కరివరదుని మదిగను!
వరదుల దరి నిలు!పరిమళ!గంధముబలె!
సురభిళ!సుమసరి!సుర లలరం! వెలుగుమ!
10.గర్భగత"-పరస్వేచ్ఛా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.భ.న.న.న.గగ.గణములు.యతులు9,18.
ప్రాసనీమముగలదు.
సిరులకు!మురియకు!చెరపకురా!చెడెదవు!చెరగొనకు!పరస్వేచ్ఛ!
గరికల!చెఱపకు!కరివరదుని!మదిగను!కరటుతనమది!తప్పౌ!
వరదులదరి నిలు!పరిమళగంధము బలె!పరులకుపకరి!వౌచున్!
సురభిళ సుమసరి!సురలలరం!వెలుగుమ!సురధములొనర!కాంతిన్!
ఇట్లు,
తమవిశ్వసనీయుడు.
మూర్తి. జుత్తాడ
జైహింద్.
1 comments:
నమస్కారములు
పండితుల వారికి ప్రణామములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.