జైశ్రీరామ్.
శ్లో. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమేవచ లక్షం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్వా హరిం భజేత్.
క. పనులైన విడిచి తినవలె,
పనులను విడి స్నానమెలమి వలయును చేయన్.
పని వీడి దాన మొసగుట,
పనివిడిచియు హరికి సేవ వలయును చేయన్.
భావము.
వందపనులున్నా భొజనం ముందు చేయవలెను. వేయి పనులున్నా స్నానము చేయవలెను. లక్ష పనులున్నా దానము చేయ వలెను. కోటి పనులున్నా హరిస్మరణము చేయవలెను.
జైహింద్.
1 comments:
నమస్కారములు
చక్కని విషయాలను వివరించారు. అన్నీచేస్తామేమొ గానీ ఒక్క హరినామ స్మరణము తప్పక .ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.