గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2018, ఆదివారం

సోయగవృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

 జైశ్రీరామ్.
 రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                      జుత్తాడ.
1.సోయగవృత్తము.
శక్వరీఛందము.న.త.భ.న.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.12,200.
బరువు మోయంగలేనని!బ్రతుకనంచు!
వెరవ!నేలయ్య?కర్మము!వెతలు గూర్చు!
సరగ!విశ్వేశు!గొల్చిన!జయముగల్గు!

2.చలితమానసవృత్తము.
శక్వరీఛందము.న.ర.న.ర.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.5,592.
చలిత మానసంబునం!సంచరింపకన్!
మలినబుద్ధులంవదలి!మంచినెంచుమా!
తులను సాటిలేనటుల!సాగుమిద్ధరన్!
కలిని ధర్మపూర్ణతను!కామిదుండవై!

3.శుభగత వృత్తము.
శక్వరీఛందము.న.భ.స.ర.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.5368.
దురితమోపు!పనులకుం!దూరముండుమా!
చిరవరాల!శుభగతం! జీరు సౌఖ్యమున్!
తరతరాల!వరదమౌ!ధర్మ సాక్షిగా!
తిరము!కీర్తి! నిలుచులే!దివ్యభూషయై!

4.తంత్రమా వృత్తము.
శక్వరీఛందము.న.ర.జ.ర.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.5464.
కులమతంపు!కుమ్ములాట!కూడదేరికిన్!
కలియుగంపు!తంత్రమంచు!కర్మమందకన్!
తెలిసి తెల్యనట్టిచేష్ట!దించుకీర్తినిన్!
బలిమి చెల్మి!నుల్మకయ్య!పంతమూనుచున్!

5.ధర్మంచరవృత్తము.
శక్వరీఛందము.ర.న.జ.ర.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.5499.
సాటివారి!మనములందు!చక్కనిల్చుమా!
మాటమర్మమొదవనీకమంచచి పెంచుమా!
మేటి ధర్మ చరుడవౌచు!మేధినిం!సదా!
పాటుబడ్డ!సుఖముగల్గు!భావ భాస్వమై!

6.మానవతావృత్తము.
శక్వరీఛందము.న.స.జ.ర.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.5472.
మంచిమనసుగల్గి నీవు!మానవత్వమున్!
పెంచిబ్రతుకు!నీతిగల్గిప్రీతి పాత్రతన్!
తృంచ కొరుల ఖ్యాతి!నెప్డు! తీవ్ర స్వార్ధతన్!
పంచు!తెలివి!కొంతమేర!వర్ధమానుడా!

7.ధర్మంచరవృత్తము.
శక్వరీఛందము.ర.న.జ.ర.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.5499.
ఇంటిపోరు!పనికిరాదు!యేరికైననున్!
బంటుకైన!పరముకైన!బాధ గూర్చులే!
కంటిమంటలలముకొన్న!కాశిదేవుడే!
మింటిగంగ!శిరసుమీద!నిల్పె!ప్రీతినిన్!
భావము:-ఇంటిలోపోరుయెవ్వరికి పనికిరాదు.బీదయైనను,పరమాత్ముడైనను
యింటిలోపోరుబాధకలిగించును.అగ్నినయనుడుపరమేశ్వరుడు,ఆకాశగంగనుప్రీతితోతలయందుధరించి,భార్యయందనురాగముచూపెను
8.తంత్రమావృత్తము.
శక్వరీఛందము.న.ర.జ.ర.లగగుణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.5464.
జడలవారు!వారియెంతొశాంతి!నొందెనే!
పడతి!గౌరిపట్టునిల్పె!భాగమర్ధతన్!
కడినికోరు !మానవాళి!కాంతగౌరవమ్!
సడలనీక!ప్రీతినిల్ప!సౌఖ్యమందరే?

9.ధర్మంచరవృత్తము.
శక్వరీఛందము.ర.న.జ.ర.లగ.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.5499.
ఆదిమాత!మనసునెంచి!యాదిదైవమే!
సాదరాన!నిల్పె!శర్వు!గేహమర్ధతన్!
చీదరరింప నువిద!చెల్లుశ్రీలు కీర్తులున్!
ఆదరించి!బ్రతుకు హాయి!నిల్పు!శోభలన్!

స్వస్తి.


మూర్తి.జుత్తాడ..
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అలతి అలతి పదములతో చక్కని పద్యములను అందించిన గురువులకు శిరసాభి వందనములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.