గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మార్చి 2018, గురువారం

ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవము. ఈ సందర్భముగా మహిళా లోకానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకొంటున్నాను.

జైశ్రీరామ్.
జైశ్రీమన్నారాయణా!
సోదరీ సోదరులకు నమస్సులు.
ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవము. ఈ సందర్భముగా మహిళా లోకానికి
నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకొంటున్నాను.

మత్తే. మహిళాలోకమె మూలమై వెలుగునీ మాన్యప్రపంచంబు. సన్
మహిళల్ జీవన మార్గదర్శకులు. ప్రేమన్ బంచి పోషింత్రు. ని
స్పృహ పోకార్పుచు నిండు జీవనమిడే సౌమ్యాత్ములీ కాంతలే.
మహనీయుండగు బ్రహ్మ వారికిడు సన్ మాంగళ్య సౌఖ్యాదులన్.

ఆదిక్తికి ఆనందరూపులైన స్త్రీమూర్తులందరికీ నా అభినందన పూర్వక
నమోవాకములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భముగా మామరదలికి , మిగిలినసోదరీ మణులకీ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.