గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, నవంబర్ 2017, గురువారం

నాగ శ్రీ (కార) బంధ కందము. . రచన. శ్రీ కందుల నాగేంద్ర వరప్రసాద్.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీమాన్ కందుల నాగేంద్ర వరప్రసాదు బంధకవి విరచిత శ్రీకార బంధ కందము తిలకించి, వారిని మీ వ్యాఖ్యలతో ప్రోత్సహించండి.
నాగ శ్రీ (కార) బంధ కందము. 
రచన. శ్రీ కందుల నాగేంద్ర వరప్రసాద్.
కం. శంకర! భవహర! శ్రీ కర! 
తంకవమున నుంటిమి గద తకపిక లాడన్ 
శంకర! మంచిది కా దభ
యంకర! మము గాచ వేగ! అభయము లిడరా! 
జైశ్రీరామ్ 
ఇట్లు
కందుల నాగేంద్ర వరప్రసాద్..
చూచిరికద కందుల కృత
ప్రాచీన ప్రబంధ కంద ప్రాభవ రచనన్?
వేచుటదేలను వ్యాఖ్యను
సూచితముగ వ్రాసి శుభము చూపుడు సుగతిన్.
బంధకవి వరప్రసాద్ గారికి అభినందనలు.
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

మీ అభిమానమునకు నా పాదాభివందనములు. నన్ను మునగ చెట్టు ఎక్కించ వద్దండి. కవిత్వ మందు ఇంచుకైనా నేర్వ లేదు. నేను బంధకవిని కాదండి మీ శిష్యుడను మాత్రమే.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ కందుల వరప్రసాద్ గారు మీ శ్రీ [కార ] బంధ కందము అద్భుతంగా నున్నది. మీ ప్రయత్నము ప్రశంస నీయము అందున శ్రీ చింతా సోదరుల ఆంధ్రామృతము లో అమృత తుల్యమే కదా ! ఇరువురికీ అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.