గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, నవంబర్ 2017, సోమవారం

శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారిచే రచింపఁబడిన మహానాగబంధము

జైశ్రీరామ్.
ఆర్యులారా! మీరు తిలకించండి
పండిత ప్రకాండులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారిచే రచింపఁబడిన
 ‘చిత్రభారతము’ కావ్యం భీష్మపర్వము నుండి
వినూత్న మహానాగబంధము” 
సీ.శ్రీమహావిష్ణుని సిద్ధసంకల్పు స
ర్వంసహానన్తర్ధవర్ధమాను
మానుతు ధర్ము ధర్మాధ్యక్షు నందనం
దాదిత్యు గోవిందు నావిలాసు
వాసవు సత్యు నిర్వాణు సాణుశ్రీశు
భాను చలాచలమానవిశ్వ
శాశ్వతైకవ్యాస సాధ్యర్తు గోప్త గ
దాధరు ధన్యదు ధామ సామ
గీ.శ్రీరమేశుని సువ్యాసు శ్రీనిలయు ని
యుక్తు సుశ్రద్ధధానతాసక్తు దిశు మ
హామఖాధ్యక్షు వాయువాహను సురమ్యు
భక్తభద్రదు ప్రేముడిన్ ముక్తి గనుమ.
స్వస్తి.
ఏల్చూరి మురళీధరరావు.
 నాగబంధ సీసమున ఇంత నైపుణ్యమును చూపిన 
శ్రీ మురళీధరరావు గారిని 
మనసారా అభినందించుచున్నాను
లీలఁగ నేలుచూరి మురళీధర రావు మహాకవీంద్రులీ
జాడను చిత్రభారతము చక్కగ వ్రాసిరి. నాగబంధమున్
చాలఁగ మెత్తురందరు. లసత్కమనీయ కవిత్వ మార్గమం
దేలిక వీరు. వీనిఁ బరమేశ్వరుఁడేలుత నిత్యమున్ గృపన్. 
జైహింద్.
Print this post

2 comments:

Ganti Lakshmi Narasimha Murthy చెప్పారు...

అద్భుతమీచిత్రకవిత్వరచనా పాటవంబు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అద్భుతమైన బంధాన్నందించారండీ! మీకూ మాన్యులు ఏల్చూరివారికీ శుభాభినందనలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.