గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, నవంబర్ 2017, మంగళవారం

శ్రీ హరి వీయస్సెన్ మూర్తి బంధకవి కృత శంఖబంధ ఆటవెలది

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి బంధకవి కృత శంఖబంధ ఆటవెలది నాశ్వాదించండి.
 శ్రీ హరి వీయస్సెన్ మూర్తి బంధకవి కృత శంఖబంధ ఆటవెలది
శంఖబంధము
ఆటవెలది
(సామాజికాంశము)
(ఆధారము - వల్లభవఝలవారి గ్రంథము)
భారతంబు నందు వారను వీరను
భేదభావ మరయ తరగ దవుర
సమత మమత తోడ చరియించ మానవుల్
సౌఖ్య భాగ్య మెందు సతత మందు.
స్వస్తి.
హరి వీయస్సెన్ మూర్తి.
శ్రీ హరి వీయస్సెన్ మూర్తి గారికి అభినందనలు. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
హరి వీయస్సెన్ మూర్తి గారి శంఖ బంధము శ్లాఘ నీయము . ధ్యున్యులు
మాకందిస్తున్న శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.