జైశ్రీరామ్
ఆర్యులారా!.శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత పద్మబంధ తేటగీతినవలోకించండి.
షట్పత్ర పద్మ బంధ తేటగీతి
(శ్రీ శ్రీనివాసా జే)
శ్రీలు గోరను సత్యమ్ము శ్రీనివాస!
నీదు భృత్యుని నన్నింత మోదమిచ్చి
వాకు లందించి నిత్యమ్ము సాకు మయ్య
దేవ! నీకు జేయందు నో దివ్యదేహ!
మూర్తి కవిగార్కి అభినందనలు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
శ్రీ హరి వీయస్సెన్ . మూర్తి గారి షట్పత్ర పద్మ బంధ తేట గీతి బహు సుందరముగా , రసరమ్యముగా నున్నది. వివిధ రకముల ఛందో బంధ పద్యములను మాకందిస్తున్న కవి శ్రేష్టులకు పాదాభి వందనములు. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.