గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, నవంబర్ 2017, గురువారం

శ్రీ హరి వీయెస్సెన్ మూర్తి కవి కృత శంఖ బంధ కందము

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయెస్సెన్ మూర్తి కవి కృత శంఖ బంధ కందమును తిలకించండి.

శంఖ బంధము కందము.
(ఆధారము – తెలుగులో చిత్రకవిత్వము)
రామ రఘువంశసోమా
శ్రీమదమేయ కరుణాఢ్య చిద్గుణ ధామా
క్షేమద సుందరనామా
భూమిన్ నీదయను మేము పొందగ లేమా.
స్వస్తి.
హరివీయెస్సెన్మూర్తి.
కవిగారికి అభినందనలు.
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు
బంధ కవి శ్రీ మూర్తి గారి శంఖబంధము అత్యద్భుతముగా నున్నది, వారికి అభినందన వందనములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వీయెస్సెన్ ముర్త్తిగారి శంఖ బంధము అద్భుతముగా నున్నది. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.