జైశ్రీరామ్.
అష్టావధాన కార్యక్రమము.
స్థలం : శ్రీ శారదా శంకర మఠం, అనంతపురము తేదీ : 26-11-2017 ఆదివారము
సమయం : 4.00 కు జరిగినది.
https://www.facebook.com/panchangam.satyam/videos/1951159648477312/
https://www.facebook.com/panchangam.satyam/videos/1951159648477312/
అధ్యక్షులు - త్రిభాషావధాని బ్రహ్మ శ్రీ డా.జోస్యుల సదానందశాస్త్రి గారు
అవధాని :
"అవధానిరత్న", సాహిత్య శిరోమణి డా.మాడుగుల అనిలకుమార్ గారు
నిషిద్ధాక్షరి :-ర (రకార, రేఫ), త, న (నకార, దృతాలు)
ణ, శ, స, వ అనే అక్షరాలు మూడు పాదాలలో రాకుండా శారదాదేవిని స్తుతించాలి.
చదువులయమ్మా కొలుచగ
మదిలో జేయంగ ధీధి మహి మణిమయమై
మదిలో ముదముగ పదమిడి
పదలముగాజేరరావె
ప్రార్థింతునినున్||
దత్తపది :-
ధనము, ధనము, ధనము, ధనము
అనే పదాలతో మీకిష్టమైన విషయాన్ని వర్ణించండి.
ధనము ధనమటంచు ధరణిలో జనులెల్ల
ధనము వెంటఁబడగ తగునదెట్లు?
జ్ఞానధనము కూడ కావలెననిఁ దల్ప
బోధనమ్ముసరిపోవుఁ ధరణి.
సమస్య :- అరచేతికి పండ్లు వచ్చి యతివను కరచెన్ ||
సరుకులు, కదళీఫలములు
వెరువక కొనిపోవుచున్న భీరువునుఁ గనన్
ధర కోతి పట్టి లాగగ
నరచేతికి పండ్లు వచ్చి యతివను కరచెన్ ||
వర్ణన :- సీతాదేవి కనపడలేదని హనుమంతుడు ఆత్మహత్య చేసుకోబోతాడు. పరీక్షలలో సఫలము కాక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని వర్ణించండి.
ధరణీపుత్రిక కానకన్ హనుమ అత్యంతంబు దుఃఖంబుతో
మరణింపంగఁదలంచుటౌర తగునే మాహాత్మ్యముల్ వీడుటల్
ధరణిన్ ఛాత్రులు ఆత్మహత్యపరులై దైన్యంబుగాఁ జచ్చుటల్
పరువున్ బోవును తల్లిదండ్రులకు సంభావింప దుఃఖంబగున్ ||
ఆశువులు :-
1.శ్రీ భారతీ తీర్థ స్వాముల వారిని
ప్రార్థించాలి.
శ్రీమత్ శృంగగిరీంద్ర పీఠనిలయా శ్రీ భారతీతీర్థ స్వా
మీ మీదౌ పదపంకజభ్రమరమై మిమ్మే స్మరింపంగ సం
క్షేమంబుల్ సమకూర్చరే అరుగవే క్లేశంబులూహింపమా
వ్యామోహంబునశింపజేయు
మనుచున్ ప్రార్థించెదన్ భక్తితో ||
2. అవధానానికి వచ్చిన మిత్రబృందాన్ని శ్రీనివాసుడు ఆశీర్వదిస్తున్నట్లుగా వర్ణించాలి.
ప్రేముడి మిత్రుబృందమలరించెడునంచవధానకార్యమి
ట్లామడలెన్నొ దాటుచు ప్రయాణముజేసి కనంగ వచ్చిరే
నీ మహిమాన్వితంబయిన నేత్రయుగాబ్జమునందుఁ గాంచుచున్
సేమమునిమ్ము వీరలకు శ్రీయుత తిర్పతి వేంకటేశ్వరా||
వ్యస్తాక్షరి :-
స కిం సఖా సాధు న శాస్తి యోధిపం.
//ఓం తత్సత్//
అవధానివరేణ్యులకు అభినందనలు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవధాన సరస్వతికి అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.