గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, నవంబర్ 2017, బుధవారం

ద్వినాగ బంధం కందము. శ్రీ కందుల వరప్రసాద్ కవి కృతము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ కందుల వరప్రసాద్ కవి కృత ద్వినాగ బంధం కందమునవలోకించి ఆనందించి, అభినమ్దించండి.
.
ద్వినాగ బంధం కందము. 
ధనవనమున జనవనమున
ధనమన ఘనమను, ఘనమన ధనమను మనసా!
ఘనధనమున మన మన మున
కొన కనకన మను ధనమన గొన కొను మనసా!
స్వస్తి.
వరప్రసాద్.
సహృదయ కవికి నా అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

Unknown చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు.... సీస పద్యమందు శతక గర్భ పద్యములను వ్రాసి జూపిన మీకు ఈ శిష్యుని చిరు కానుక
తప్పులున్న మన్నించి తెలుప ప్రార్ధన...

వర్ణముల వివరణలెల్ల వరలు జెప్పి,
సీసమున శత ధారలు పోసి నట్టి ,
బంధ గర్భ పద్యములను వ్రాయు వారి
బంధువయిన ఘనకవికి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.