జైశ్రీరామ్.
ఆర్యులారా! అరిషడ్వర్గమును గూర్చి వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి విరచించిన కందములందములనానందముగ చూడుడు..
1.కం. కామంబనగా!కోరిక
కామంబే!నాశమేర్చు!కర్మల నెలవై!
క్షేమంబోపని కామము
రామంబా?కాదు కాదు!రాజీవాక్షా!
2.కం. క్రోధము!తగ దెవ్వరికిని!
శోధింపగ!దుష్కృతముల!దామంబగుచున్ !
బాధించు!పరుల!స్వేచ్ఛను!
రాధేయా!మము!కనంగ!రావా!కృష్ణా!
3.కం. లోభము!జీవన!నరకము!
భీభత్సపు!గురిని !జిక్కి!భీతిల!జేయున్!
శోభిత కీర్తి!నశించును!
శోభాయక కీర్తనలను ! సుగుణత గనుమా!
4.కం. మోహము మోహిత వరమై
శ్రీహరి!గని మెచ్చునటుల! జీవన సరళిన్!
ద్రోహపు చింతన మానుచు
శ్రీహరి!హరయనగ!రక్ష చేకురు!నరుడా!
5.కం. మదమది!భవిత!వినాశము
ముదమొదవు!మదము!శుభగము! మోక్షము!నిచ్చున్!
మద'--పర సమ్మోహిని
సదనంబవ!మెదలుగాదె?స్వార్ధము! నరుడా!
6.కం. కుత్సిత!మత్సర!భావము!
సత్సంగము!చేరనీదు?చతురిమ!చెరచు న్!
వత్సా! సత్యము! మరువకు!
తత్సామ్యము !కనవశంబె?ధాత్రీ తలమున్!
స్వస్తి.
వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.
కవికి అభినందనలు
జైహింద్.
కవికి అభినందనలు
జైహింద్.
1 comments:
నమస్కారములు
అరిష్డ్వర్గములను చక్కగా వివరించిన కవిపుంగవునకు నంస్కృతులు .+ ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.