గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, అక్టోబర్ 2017, బుధవారం

ప్రణవ వృత్త గర్భ సీసము. .. .. .. రచన శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ

 జైశ్రీరామ్.
ఆర్యులారా! నా ప్రియ సహోదరులు నా రచనా స్ఫూర్తితో రచించినప్రణవ వృత్త గర్భ సీసము. చూడండి.
బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ

శ్రీ Chinta Rama Krishna Rao గారి స్ఫూర్తితో రచించిన
ప్రణవ వృత్త గర్భ సీసము. 
రచన శ్రీ Anantha Krishna
ఆర్తిన్ కలిగిన భావావేశము పలు రూ
పాలై సరగున తా పరుగులిడదె
భావ్యమై వరలు సేవాభాగ్యము సిరిగా
తోచన్ యథాశక్తి తోడు నిల్వ
యవ్వారలైన దైవారాధన ధర నీ
రీతిన్ సలుప వచ్చు రేయి పవలు
పాలు పంచుకొని నావారందరు నడువం
జేతున్ ప్రమాణాల చేత చేయ
తే॥గీ॥
శక్తి కలవారు సేవనాసక్తి చూప
అందరొకటై మెలుగుట హాయి యనుచు
కలిమి లేములన్న తెరలు కరిగి పోవ
సమసమాజము నిల్పుడు సతము నిచట

సీసగర్భస్థ ప్రణవ వృత్తము. ( ప్రణవ వృత్తము - మ న య గ .. యతి 6 )
భావావేశము పలు రూపాలై
సేవా భాగ్యము సిరిగా తోచన్
దైవారాధన ధర నీరీతిన్
నావారందరు నడువంజేతున్
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రణవ వృత్తము అలతి, అలతి పదములతో అద్భుతముగా నున్నది. బ్రమ్మ శ్రీ వేంకట అనంత కృష్ణ గారికి శత వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.