గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, డిసెంబర్ 2009, శనివారం

మంత్ర పుష్పాదులు. అత్యద్భుత స్తోత్ర రాజము.రాజ హంస వృత్తము:-

" త - త - త - త - త - త - త - త - గ." అను గణములు వచ్చును.
"UUI - UUI - UUI - UUI - UUI - UUI - UUI - UUI - U."
{ ఇందు చివర గల 1 లఘువు, 1 గురువు తీసివేస్తే పద్మనాభ వృత్తమౌతుంది.}
యతి 13 వ క్షరము.
ప్రాస నియమము కలదు.

శ్రీ మన్మహాదేవు డీ సృష్టిఁ గావించి శ్రీ దేవితో పాల సంద్రాన నుండెన్గదా!
యీమాయ లోఁ జిక్కియా దేవు భావంబు నెన్నంగ సాధ్యంబె?కానన్ సదా
శ్రీమన్మహామంత్ర రాజంబు నాలించి, చెన్నొందు వారల్ కృతార్థుల్. వినం
ప్రేమన్ పఠింపన్, మదిన్ దేవు గాంచన్ సమీపంబునందుంచితిన్ దీనినిన్.

అధ్యాత్మ భావ తత్పరుల కందుబాటుగా ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను.
వారికి ఇది ఏమాత్రము సంతృప్తిని కలిగించఁ గలిగినా, పరమాత్మానుభూతి కలిగించఁగలిగినా ఈ నా కృషి సఫలీకృతమైనట్టే. జై శ్రీరామ్.

జైహింద్.
Print this post

1 comments:

durgeswara చెప్పారు...

machi sahaayam chesaaru

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.