గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, డిసెంబర్ 2009, శనివారం

చెప్పుకోండి చూద్దాం 27.

ప్రియ పాఠకులారా!
ఈ క్రింది పద్యంలోని ఆంతర్యాన్ని గ్రహించి సమాధానం చెప్పుకోండి చూద్దాం.

ఆ:-
వేయి కనులు గలిగి వెలయు. ఇంద్రుడు కాడు.
కాళ్ళు నాల్గు కలిగి కాదు పశువు.
నరుడు పట్టకున్న నడువగా జాలదు.
దీని భావమేమి? తిరుమలేశ.

మీరు సునాయాసంగా చెప్పెస్తారని నాకు తెలుసు. అందుకే మీ సమాధానంకోసం ఎదురు చూస్తుంటాను.
వీలైతే ఛందో బద్ధంగా చెప్పి పాఠకుల నానంద పరవశుల్నిచేయండి.

జైహింద్
Print this post

5 comments:

lakshman చెప్పారు...

I am reading your articles regularly at Jalleda.

Your Telugu poems are really good and really I am very thankful to your Telugu poems. It is really interesting and helping to long live Telugu.

But unfortunately your are not disclosing the answers. Really it is bad. As a software engineer I am very week in telugu poetry and almost i have forgotted most of the telugu grammer and literature.
So i don't spend time to think about answers. due to lack of knowledge in Telugu literature. I don't have curious to check your blogs for answers also.
But what I would expect is, whenever i read the article I want to know the solution.
So please publish your answers on the spot. This will help us to spend more time and recap the past Telugu literature and knowledge

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

లక్ష్మణ గారూ! చాలా సంతోషం మీరు నిత్యం తెలుగు భాషపై ఉత్సాహంతో నా బ్లాగు చదువుతున్నందుకు.
ఐతే మీరు సమాధానాలను వెంట వెంటనే వ్రాయమంటున్నారు. ఇది వరలో అలా వ్రాయడం వలన ప్రయోజనం లేదంటూ ప్రశ్న మీరివ్వండి, సమాధానం పాఠకులను ఆలోచించనివ్వండి, అంటూ మీవంటివారు కొందరు వ్రశారు.
దానిని దృష్టిలో పెట్టుకొని సమాధానాలను పాఠకులు చెప్పనిచ్చి అవి సరయినవి కాకపోతే సరిచేసి చెప్పుతున్నాను. ఐతే మీరు నా పాత టపాలు తిరగెయ్యండి. సమాధానాలు పాఠకుల వ్యాఖ్యలలోనో, నేను తెలుపురంగు పూసి భద్రపరచిన వాటిలోనో ప్రత్యక్షమవతాయి.
మీరు అడిగినందుకు నేను మీకు సమాధానాలను పంపుతుంటానులెండి.
ధన్యవాదాలు.

Sandeep P చెప్పారు...

ఆ||
వంటలన్ని జుర్రి, మటుమాయమయ్యేను
కాని కిట్టమూర్తి కానె కాదు!
తేనెలూరు పెదవి, తెమ్మెరంటినడక
తమ్మితోన చెలిమి, తన్వి గాదు!

ఆ||
ఇంటి మగువ పెదవి, యెరుపెక్కు చందాన
ముద్దులాడు గాని మొగుడు కాదు!
ఆవులించినంత ఆలపించును లాలి
అమ్మ కాదు జూడ, బదులు ఈగ!

ఈ సమాధానాన్ని చక్కని భావుకతతో చెప్పడానికి సాయం చెసిన మా చెల్లెమ్మ ప్రియదర్శినికి నా అభినందనలు.

mmkodihalli చెప్పారు...

వేయి కనులు గలిగి వెలయు ఇంద్రుడు కాడె?
కాళ్ళు నాల్గు కలిగి కాదె పశువు?
నడువజాలదయ్య నులకమంచమిలను!
దీని భావమిదియె! తిరుమలేశ.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

కమ్మని జొన్న కూడు తిని కాయపు కష్టము మాయమౌనటుల్
ఝుమ్మని చేలపై కదలి జోరుగ వీచగ చల్ల గాలియున్
నెమ్మది వేయి కన్నులతొ నేర్పుగ నాలుగు కాళ్ళుకల్గి నన్
రమ్మని పిల్తువో నులక మంచమ కైపగు కున్కు తీసెదన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.