గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, డిసెంబర్ 2009, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం 22.

పాఠక మహాశయులారా!
ఈ క్రింది సీసమునందడిగిన ప్రశ్నలకు సామాధానాలు చెప్పుకోండి చూద్దాం.

సీ:-
అసమాన కోదండుడైన రాజెవ్వడు?
రాజు పేరిట గల రాగ మేది?
రాగంబు సరివచ్చు రాజిత ఋతువేది?
ఋతువు పేరిట గల రుద్రుడెవడు?
రుద్రుని పేరిట రూఢియౌ పక్షేది?
పక్షి పేరిట గల వృక్షమేది?
వృక్షంబు సరివచ్చు వెలయు భూషణ మేది?
భూషమే సరి వచ్చు భూమి యేది?
తే:-
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరములు
ఆదులుడుపంగ తుదలెల్ల నాదులగును.
చెప్పుడయ్యరో మీరలు చేవఁ జూపి.
పేర్మినాంధ్రామృతము గ్రోలు పెద్దలార.

వెంటనే పోష్ట్ చేస్తారు కదూ?

జైహింద్.
Print this post

2 comments:

mmkodihalli చెప్పారు...

శ్రీరామారువసంతపసీతవటముక్కెరంగము.

జ్యోతి చెప్పారు...

శ్రీరామ
మౌక్తిక
కర్కశ
శంభువు
వసుధ
దేనువు
వాయసం
సంపంగె

రామకృష్ణగారు,
రాజుపేరిటగల రత్నమనుకుంటా??

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.