గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జనవరి 2025, సోమవారం

ఆంధ్రామృత పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.

ఆంధ్రామృత పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

మీ జీవితంలో ప్రతీ దినమూ నిత్య నూతన సంక్రాంతిగా మీకు ఆనందమయం కావాలని కోరుకొంటున్నాను.

జైహింద్.

11, జనవరి 2025, శనివారం

శతావధాని భరత్ శర్మ 79వ అవధానము - - భాగ్యనగరం 79th Avadhanam Avadhani Bha...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

అట్లతద్ది రోటుయ్యాల. అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ ఆనందానికి అంతు లేని పండుగ.

0 comments

 జైశ్రీరామ్.

మన పల్లెప్రాంతాలలో అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయాలు మన అనుబంధాలను ఎంతగొప్పగా పెంచిపోషిస్తాయో ఈ అట్లతద్ది ఊయల ఉత్సవం చూస్తే మనకు అర్థమౌతుంది.
సృజనాత్మకత ఉన్న కవులకీ అంశం ఒక చక్కని అవకాశం పద్యరచనకి.

జైహింద్.

శ్రీమతి దోర్బల బాలసుజాత గారు రచించి ఆలపించిన స్వామివారి మేలుకొలుపు.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీమతి దోర్బల బాలసుజాత

అభినందనలమ్మా.

జైహింద్.

10, జనవరి 2025, శుక్రవారం

భక్తజనులైన ఆంధ్రామృత పాఠకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.

ఓం నమో నారాయణాయ.

శ్లో.  కృత్వోత్సవం తథాభూతం - ఏకాదశ్యాం విశేషతః

విశంతి మోక్షం తస్మాత్‌ - సః మోక్షోత్సవ ఇతీర్యతే.

తే.గీ.  శ్రీకరంబౌచు నేకాదశీ దినంబు

వచ్చు పుష్యశుద్ధమునందు వామనుండు

ముక్తిదుండయి దర్శనమునొసగుటను

వత్తు రా దేవతల్ తాము భక్తిఁ గనఁగ.

భావము.  ఈ ఉత్సవానికి మోక్షోత్సవమనే పేరు కూడా ఉంది. దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలవడం జరిగింది.

ఈ కారణంగా ఉత్తర ద్వారదర్శనం పరమాత్మ నేడనుగ్రహిస్తాఁడు. 

కం.  మదులందిత్తరముఖమున

విధిజనకునిఁ జూచువారి విషయమునందున్

వ్యధలు నశించును, శుభములు

సుధవలె మహితముగ వచ్చు శోభను గూర్చున్.

కావున మనసా ఆశ్రీమన్మహావిష్ణువును దర్శించుకొనెడి మీకందరికీ శుభాకాంక్షలు తెలియఁజేస్తోంది ఆంధ్రామృతం.

జైహింద్.

9, జనవరి 2025, గురువారం

సత్యమేవేశ్వరో లోకే . ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  సత్యమేవేశ్వరో లోకే - సత్యే ధర్మాః సదాశ్రితాః

సత్య మూలాని సర్వాణి - సత్యాన్నాస్తి పరం పదమ్.

తే.గీ.  సత్యమేదైవమీసృష్టి, నిత్యమిదియె,

సత్యమున జేరు ధర్మముల్, శాశ్వతముగ,

సత్యమే మూలమన్నైంట, సరస హృదయ!

సత్యమును మించి లేవయ్య! సత్యపాల!

భావము.  ఈ లోకంలో సత్యమే భగవంతుడు. సత్యాన్ని ధర్మాలు అన్నీ ఎల్ల వేళలా 

ఆశ్రయించుకుని ఉంటాయి. సత్యమే అన్నిటికీ మూలం. సత్యాన్ని మించినది 

ఏమీ లేదు.

జైహింద్.


అసుర్యా నామతే లోకా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

మంత్రము.  అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః

తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తియేకే చాత్మహనో జనాః. (ఈశావాస్యోపనిషత్ ౩)

తే.గీ.  రక్కసుల లోకముకు చూడ నిక్కముగను

గాఢమైనట్టి చీకటిన్ గప్పి యుండు,

నాత్మహంతులందుదు రట్టిలోక

మును గనంగను నాత్మహననము వలదు.

భావము.  రాక్షసుల యొక్క లోకాలు గాఢమైన అంధకారముతో అంటే చీకటితో 

ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు.

జైహింద్.

కుర్వన్నేవేహ కర్మాణి. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.


మంత్రము. కుర్వన్నేవేహ కర్మాణి -  జిజీవిషేచ్చతగ్‌ం సమాః

ఏవం త్వయి నాఽన్యథేతోఽస్తి  - న కర్మ లిప్యతే నరే. (ఈశావాస్యోపనిషత్ ౨)

తే.గీ.  వరల కర్మలన్ జేయుచు వర్షశతము

నాశపడుమీవు, మించుచు నాశపడకు,

మింతకన్న నన్యము లేదు, శాంతచిత్త!

అరయ కర్తవ్యములు నిన్నునంటఁ బోవు

అర్థం: ఈ లోకములో కర్తవ్యాలను నిర్వహిస్తూ మాత్రమే నూరేళ్ళు 

జీవించాలని ఆశించు. నీలాంటి వారికి ఇది తప్ప వేరే దారి లేదు. 

కర్తవ్యాలు నిన్ను అంటవు.

జైహింద్.

ఓం పూర్ణమదః పూర్ణిమదం . ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.


మంత్రము.  ఓం పూర్ణమదః పూర్ణిమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే 

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే. (ఈశావాస్యోపనిషత్ )

తే.గీ.  పూర్ణమెన్నంగ దైనంబు, పూర్ణమైన

దరయ నీ సృష్టి, మదిలోన నరసిచూడ

పూర్ణముననుండి తీసినన్ బూర్ణమపుడు

పూర్ణమేశేషమైయుండు పూజ్యులార!

భావము.  దేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. 

పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. 

పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా 

పరిపూర్ణతే మిగిలి ఉంది.

జైహింద్.

ఈశా వాస్య మిదగ్గ్ సర్వం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్

తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనమ్.(ఈశావాస్యోపనిషత్ ౧)

తే.గీ..  ఈశ్వరుని సృష్టిలోనుండు నీ సతతము

నీశ్వరునికే సదా చెల్లు నీశ్వరుండె 

నుండునంతట ననుచు నీవుండు మెపుడు,

పరుల ధనము నాశింపకు, వరగుణాఢ్య!

భావము.  జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీ భగవంతునిచే నింపబడాలి. 

అలాంటి త్యాగబుద్ధితో ఈ లోకాన్ని అనుభవించు. ఎవరి ధనాన్నీ ఆశించకు.

జైహింద్.

8, జనవరి 2025, బుధవారం

శతావధానం 23rd Shathavadhanam-Morning | శతావధానం | By Brahmasri Vaddiparti Padmaka...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శతావధానాలలో అద్వితీయ ఘట్టం..త్రిభాషా సహస్రావధాని డా.వద్దిపర్తి పద్మాకర్ ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, జనవరి 2025, మంగళవారం

అనిచ్ఛంతోఽపి వినయం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అనిచ్ఛంతోఽపి వినయం - విద్యాభ్యాసేన బాలకాః | 

భేషజేనేవ నైరుజ్యం - ప్రాపణీయాః ప్రయత్నతః ||

(హరిహర సుభాషితం)

తే.గీ.  రోగమును బాపు యత్నించి రోగికిలను

వైద్యుఁ డటులనే బాలుండు విద్యనేర్వ

బాధపెట్టుచున్ననుగాని మోదమలర

నేర్పవలె విద్య కృషిచేసి నేర్పు తనర.       

భావము.  రోగికి చికిత్స చేయడానికి నిరంతర ప్రయత్నం చేసి ఔషధం ఇచ్చి 

రోగాన్ని పరిహరించినట్లే, పిల్లలు ఇష్టపడకపోయినా వారికి ప్రయత్నపూర్వకంగా 

విద్యను అభ్యసింపజేసి మంచి నయమూ, నీతులూ నేర్పాలి.

జైహింద్.

6, జనవరి 2025, సోమవారం

శ్రీరంగమహత్వము. లో చిత్రకవిత్వం. ... భైరవ కవి.

0 comments

 

జైశ్రీరామ్.


జైహింద్.


5, జనవరి 2025, ఆదివారం

ఏకదిన శతావధానం...అవధాని...బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ మహోదయులు. నేను సమస్య, దత్తపది ప్రాశ్నికుఁడను.

0 comments

జైశ్రీరామ్

జైహింద్. 

విశ్వహిందూపరిషత్ ప్రార్థనా మంత్రము.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

హైందవ శంఖారావం' సభ | Vishva Hindu Parishad | Haindava Shankaravam...🔴Live:

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

లలితా శ్రీచంద్రమౌళీశ్వరా! శతకపద్యము. గానము. శ్రీమతి దోర్బల బాలసుజాత.

0 comments

 

జైశ్రీరామ్.

శ్రీ చంద్రమౌళీశర శతకము
రచన  :  చింతా రామకృష్ణారావు.
శా. శ్రీమన్మంగళ నామ! భక్త సులభా! శ్రీ పార్వతీ వల్లభా!
క్షేమంబున్, శుభ సంహతిన్, గొలుపు నీ చిద్రూపమున్ గాంచనీ. 
శ్రీమన్మంజుల భాషణా! ధిషణులన్ జిద్వర్తివై యుండి, స
త్ప్రేమన్ గావుము లోకపాల! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!  

జైహింద్.

శ్లోకానువాదాలలో సత్తా చూపుతున్న దత్తాత్రేయ.

1 comments

 జైశ్రీరామ్.

శ్లోకానువాదాలలో సత్తా చూపుతున్న దత్తాత్రేయ.

చూడండి ఈ క్రింది శ్లోకాన్ని ఎంత సునాయాసంగా అనువదించారో.

శ్లో.  గో భూ తిల హిరణ్యాజ్య   -  వస్త్రౌ ధాన్య గుడాని చl

రౌప్యం లవణ మిత్యాహు:  -  దశ దానా: ప్రకీర్తతాll

తే.గీ.  ఆవు భూమి నువ్వులు హిరణ్యంబునేయి

వస్త్రములు ధాన్యముగుడ లవణ రజతము

లనెడు దశదానములను ప్రియంబుతోడ

దానమిడవలె వేద మంత్రములతోడ.

భావము.  దూడతో కూడిన ఆవు, భూమి,నువ్వులు, బంగారం, ఆవు నెయ్యి, 

వస్త్రాలు,  ధాన్యం, బెల్లం, వెండి, ఉప్పు.. అనేవి దశ దానాలు. వీటిని 

మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి.

త్వరలో ఈ కవినుండి సుభాషిత శతకం రాబోతోంది.

జైహింద్.

ఆపత్కాలే తు సమ్ప్రాప్తే - యన్మిత్రం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఆపత్కాలే తు సమ్ప్రాప్తే - యన్మిత్రం మిత్రమేవ తత్ ॥

వృద్ధికాలే తు సమ్ప్రాప్తే - దుర్జనోఽపి సుహృద్భవేత్ ॥

తే.గీ.  అపదలయందు తోడున్నయతఁడె సఖుఁడు,

సంపదలుకల్గు వేళలో సహజముగనె

చెడ్డవారును  సఖులుగా చేరుచుంద్రు,

మిత్రశత్రులనెఱుగుచు మెలగవలెను. 

భావము.  విపత్తును ఎదుర్కొన్నప్పుడు మీ పక్షాన నిలబడే వ్యక్తి  మీ నిజమైన 

స్నేహితుడు. లేకుంటే మీరు సర్వతోముఖాభివృద్ధి  దశనున్నప్పుడు 

దుర్మార్గులు కూడా మీ స్నేహితుల వలె ప్రవర్తిస్తారు.

జైహింద్.