గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2023, గురువారం

*వేదాంగాలు/వ్యాకరణ సంబంధ 55 పుస్తకాలు(PDF)లింక్స్

0 comments

జైశ్రీరామ్.

 *వేదాంగాలు/వ్యాకరణ  సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------
55 పుస్తకాలు ఒకేచోట  https://www.freegurukul.org/blog/vedangalu-pdf

               (OR)

ఆధునిక భాషా శాస్త్ర సిద్దాంతాలు www.freegurukul.org/g/Vedangalu-1

అక్షర సమామ్నయము www.freegurukul.org/g/Vedangalu-2

బాల వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-3

ఆంధ్ర సంస్కృత వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-4

సంగ్రహ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-5

విద్యార్ధి కల్పతరువు-2 www.freegurukul.org/g/Vedangalu-6

సంస్కృత వ్యాకరణము-1 www.freegurukul.org/g/Vedangalu-7

తెలుగు వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-8

అలంకార శాస్త్రము - ఆధునిక సాహిత్యము www.freegurukul.org/g/Vedangalu-9

బాల వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-10

బాల వ్యాకరణ సూక్తులు-1 www.freegurukul.org/g/Vedangalu-11

బాల వ్యాకరణ సూక్తులు-3 www.freegurukul.org/g/Vedangalu-12

ఛందో వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-13

సంస్కృత క్రియలు www.freegurukul.org/g/Vedangalu-14

సరస్వతీ కంఠాభరణము -1 www.freegurukul.org/g/Vedangalu-15

విభక్తి భోదిని www.freegurukul.org/g/Vedangalu-16

విద్యార్ధి వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-17

శబ్ద మంజరి www.freegurukul.org/g/Vedangalu-18

శబ్ద రత్నావళి www.freegurukul.org/g/Vedangalu-19

సంస్కృత వ్యాకరణ సంగ్రహము www.freegurukul.org/g/Vedangalu-20

తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం www.freegurukul.org/g/Vedangalu-21

ఆకురాయి -తెలుగు వ్యాకరణ సంపుటి www.freegurukul.org/g/Vedangalu-22

సులభ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-23

అలంకార మంజరి www.freegurukul.org/g/Vedangalu-24

ప్రౌడ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-25

జానపద సాహిత్యంలో అలంకార విధానము www.freegurukul.org/g/Vedangalu-26

వ్యాకరణ చంద్రిక-1 www.freegurukul.org/g/Vedangalu-27

లక్షణ సార సంగ్రహం www.freegurukul.org/g/Vedangalu-28

సులభ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-29

లఘు సిద్ధాంత కౌముది www.freegurukul.org/g/Vedangalu-30

తెలుగులో దేశిచ్చందస్సు www.freegurukul.org/g/Vedangalu-31

బాల ప్రౌడ వ్యాకరణ సర్వస్వము-2 www.freegurukul.org/g/Vedangalu-32

వ్యాకరణ పదకోశము www.freegurukul.org/g/Vedangalu-33

సులభ వ్యాకరణము-1 www.freegurukul.org/g/Vedangalu-34

బాలచందాలోకము www.freegurukul.org/g/Vedangalu-35

ఆంధ్ర శబ్ద తత్వము-2 www.freegurukul.org/g/Vedangalu-36

ప్రౌడ వ్యాకరణ ఘంటాపధము www.freegurukul.org/g/Vedangalu-37

ఆంధ్ర శబ్ద తత్వము - క్రియా ప్రకరణము www.freegurukul.org/g/Vedangalu-38

ప్రసిద్దాంధ్రవ్యాకరణాలు www.freegurukul.org/g/Vedangalu-39

ఆంధ్ర వ్యాకరణ సర్వస్వతత్వము www.freegurukul.org/g/Vedangalu-40

ఆంధ్ర శబ్ద మంజరి-1 www.freegurukul.org/g/Vedangalu-41

ప్రౌడవ్యాకరణ వ్యాఖ్యానుశీలనము-1 www.freegurukul.org/g/Vedangalu-42

లక్షణ శిరోమణి www.freegurukul.org/g/Vedangalu-43

ఛందో దర్పణము www.freegurukul.org/g/Vedangalu-44

ఆంధ్ర మహా భారతము ఛందఃశిల్పము www.freegurukul.org/g/Vedangalu-45

భాషా కువలయానందము www.freegurukul.org/g/Vedangalu-46

పరమ లఘు మంజూష -1 www.freegurukul.org/g/Vedangalu-47

తెనుగు లఘు వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-48

వాక్య పదీయము-1 www.freegurukul.org/g/Vedangalu-49

వాక్య పదీయము-2 www.freegurukul.org/g/Vedangalu-50

ఆంధ్ర వ్యాకరణ సర్వస్వము www.freegurukul.org/g/Vedangalu-51

సార సంగ్రహ గణితము-1 www.freegurukul.org/g/Vedangalu-52

యాజ్ఞవల్క్య శిక్ష www.freegurukul.org/g/Vedangalu-53

తెలుగు కోర్స్ www.freegurukul.org/g/Vedangalu-54

ఆంధ్ర భాషా వికాసము www.freegurukul.org/g/Vedangalu-55

వేదాంగాలు/వ్యాకరణము పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
Android App: FreeGurukul 
iOS App: Gurukul Education  
Helpline: 9042020123
*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

జైహింద్.

అతి ముఖ్యమయిన గ్రంథముల లింకులు.

0 comments

జైశ్రీరా మ్.

 అతి ముఖ్యమయిన గ్రంథముల లింకులు.  





మీ పుట్టిన తేదీనబట్టి మీ జీవిత రహస్యం : https://templeinformationpics.blogspot.com/2017/08/free-telugu-astrology-pdf-book-download.html
















గరుడ పురాణం : shorturl.at/qBD35




స్నానం , భోజనం , తాంబూలం : https://templeinformationpics.blogspot.com/2020/01/snanamu-bhojanamu-thambulamu-telugu-pdf.html



జ్ఞాపక శక్తి పెంచే విధానాలు : https://templeinformationpics.blogspot.com/2017/09/memory-power-book-in-telugu-pdf-free.html

ప్రశాంత జీవినానికి 18 సూత్రాలు : https://templeinformationpics.blogspot.com/2017/09/prasanta-jevananiki-18-sutralu-book-pdf.html



జైహింద్.

అష్టావధానం మియాపూర్ లో / Ashtavadhanam in Miyapur

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

చంద్రయాన్ విజయవంతంగా చంద్రమండలము చేరిన సందర్భంగా చెప్పలేనంత ఆనందంగాఉంది.

0 comments

జైశ్రీరామ్..🙏

 ఓం శ్రీమాత్రే నమః.🙏

చంద్రయాన్ విజయవంతంగా చంద్రమండలముపై మనపతాకమును ప్రతిష్టించిన సందర్భముగా మన చంద్రయాన్ విజ్ఞానవేత్తలందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక అభినందనములందించుచున్నాను.

సోదర భారతీయులందరికీ అభినందనలు. మన అమ్మ భరతమాత నిత్యకల్యాణగుణ సంపన్న. అమ్మ ఆదరణనుపొందిన బిడ్డలకపజయమనేదే ఉండదు.

ఇక మన అమ్మకు తమ్ముఁడయిన మన మామ చంద్రుఁడు ఎంత ఆశగానో ఎదురు చూస్తూ ఆహ్వానం పలికి మన పతాకప్రతిష్ఠతోపులకించిపోయాడు. నాకైతే పట్టరానంతానందంగా ఉంది. ఆనందం తెలుపుకోడానికి మాటలే రావటం లేదు.

💐💐💐

శా.  శ్రీమన్మంగళ చంద్రుఁ డాతురతతో చేసాచి రమ్మంచు, నే

మామన్ మీకని యాదరింపగ, నటన్ మా భారతీయప్రభల్

వ్యోమంబందున వెల్గ కేతనము భావోద్దీప్తితోఁ జేరె, నో

శ్రీమాతా! భరతావని ప్రభలనే ప్రీతిన్ గృపన్ బెంచితే?

🙏

ఇది అంతా ఆ జగన్మాత అయిన శ్రీమాత దయవలన మాత్రమే మనకు లభించినది. ఆ తల్లికి పాదాభివందనములు సమర్పించుచున్నాను.

జైహింద్.

జై భారత్🙏

భువన విజయము. పాలపర్తి శ్యామలానందప్రసద్, గరికపాటి మున్నగువారితో...

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

అగ్నిహోత్రఫలా వేదాః ..... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో|| అగ్నిహోత్రఫలా వేదాః శీలవృత్తఫలం శ్రుతమ్l

రతిపుత్రఫలా నారీ దత్తభుక్తఫలం ధనమ్ll

తే.గీ.  వేద ఫల మగ్ని కొసగుటే ప్రీతితోడ,

శాస్త్ర ఫలము సద్వర్తనే సన్నుతముగ,

పత్నిఁ గూడుట సత్పుత్ర ఫలము కొఱకె,

ధనము దాన భోగములకే ధరణి నరయ.

భావము.   "వేదాధ్యయనానికి ఫలం అగ్నిహోత్రాన్ని అర్పించడమే. శాస్త్రానికి ఫలం సత్ప్రవర్తన. 

స్త్రీ సంగమానికి ఫలం సుఖసంతానం కలగడమే. ధనానికి ఫలం దానం చేయడం,

అనుభవించడమూను!
జైహింద్.    



వలిభిర్ముఖమాక్రాంతం ..... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  వలిభిర్ముఖమాక్రాంతం  -  పలితేనాంకితం శిరః ।

గాత్రాణి శిథిలాయంతే  -  తృష్ణైకా తరుణాయతే ॥ 

కం.  కలుగును ముఖమున ముడతలు

తెలతెల్లని జుత్తు శిరము తేజము బాపున్,

కల దేహము శిధిలమగును,

కలిగెడి కోర్కెలు తరుణముగా నుండునహో.

భావము. ముఖమున ముడుతలు వచ్చును.  జుత్తు నెరిసిపోవును. శరీరను 

శిధిలావస్థకు చేరును. ఐనప్పటికీ కోరికలు మాత్రము 

నిత్య నూతనముగా కలుగుచునే యుండును.

జైహింద్. 

అవశ్య మనుభోక్తవ్యం .... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో౹౹  అవశ్య మనుభోక్తవ్యం  -  కృతం కర్మ శుభాశుభమ్।

కృతకర్మక్షయో నాస్తి  -  కల్పకోటిశతైరపి॥

ఆ.వె.  అనుభవింప వలయు నశుభ,శుభఫలము

లాచరించు కర్మ మోచనకును,

కల్పశతముకోటి గడచిపోయినకాని

యనుభవింపవలయునట్టికర్మ.

భావము:- చేసిన కర్మ మంచిదైనా చెడ్డదైనా తప్పకుండా అనుభవించవలసినదే. 

వంద కోట్లకల్పాలకు కూడా చేసిన కర్మ అనుభవించకుండా క్షీణించదు.

జైహింద్.

23, ఆగస్టు 2023, బుధవారం

సమస్యాపూరణ. పాపులు పుణ్య భాజనులు, పావన మూర్తులు దుఃఖ భాజనుల్,... పూరణ...చింతా రామకృష్ణారావు.

0 comments

జైశ్రీరామ్. 

పాపులు పుణ్య భాజనులు, పావన మూర్తులు దుఃఖ భాజనుల్,

నా పూరణ.
👇
శ్రీపతి సృష్టిలోన కలి చిన్మయలీల లివే కదా కనన్?

జ్ఞాపకశక్తి తగ్గుటను కల్కి ప్రభావముచేత నీ ధరన్

పాపులు పుణ్యకార్యములు, పావను లన్యవిధంబునొప్పుటన్,

పాపులు పుణ్య భాజనులు, పావన మూర్తులు దుఃఖ భాజనుల్,
🙏
సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.

జైహింద్.

మక్షికా వ్రణ మిచ్ఛంతి ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో:  మక్షికా వ్రణ మిచ్ఛంతి, ధన మిచ్ఛంతి పార్థివాః ౹

నీచాః కలహ మిచ్ఛంతి, శాంతి మిచ్ఛంతి సాధవః ౹౹


తే.గీ.  మక్షికంబు వ్రణంపై మనసు పడును,

ధనము కోరును రాజు తా ధరణి నేల,

కలహమును గోరు నీచుఁడు కలుష మతిని,

శాంతినే గోరు సాధువు సరస మతిని.

భావం: ఈగలు పుండ్ల మీదనే వాలును. పాలకులు ధనం పైనే దృష్టి పెడతారు. 

నీచులు కలహాన్నే కోరుతారు. సాధువులు శాంతినే ఆకాంక్షిస్తారు.

జైహింద్. 

సత్యహీనా వృథా పూజా ..... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో:  సత్యహీనా వృథా పూజా, సత్యహీనో వృథా జపః ౹

సత్యహీనం తపోవ్యర్థం, ఊషరే వపనం యథా ౹౹


తే.  చవట నేలపై విత్తులు చల్లినటుల

సత్యదూరమౌ పూజయు , జపము, తపము,

వ్యర్థ మరయగ, గని పరమార్థమెన్ని

సత్య జపతపాదులు చేయ సత్ఫలమిడు.

భావము: చవుటి నేలలో విత్తనాలు చల్లితే వ్యర్థమైనట్లుగా సత్యహీనమైన పూజా, 
జప తపాదులన్ని  నిరుపయోగమే అవుతుంది.

జైహింద్.

పద్య భారతి వారి అవధాన భారతి//Bhakti Prapancham ... లో నేను.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

నిష్ణాతోఽపి చ శాస్త్రార్థే ...... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్., 

శ్లో. నిష్ణాతోఽపి చ శాస్త్రార్థే  -  సాధుత్వం నైతి దుర్మతిః౹

ఆకల్పం జలమగ్నాపి  -  మార్దవం నైతి వై శిలా౹౹

తే.గీ.  శాస్త్ర నిష్ణాతుఁడైనను సహజమయిన

దుర్గుణంబును వీడడు దుష్టుఁడిలను,

నీట నెన్నాళ్ళు మున్గి యేపాటియైన

మెత్తబడ నేర్చునే శిల? మీరెఱుఁగరొ?

భావము. శాస్త్రార్థంలో సమర్థుడైనప్పటికి దుష్టుడు మంచితనాన్ని పొందలేడు.

యుగాలతరబడి నీటిలో మునిగి ఉన్నా బండరాయి మెత్తగా కాజాలదు.

జైహింద్.

దేవద్విజగురుప్రాజ్ఞ ..... మేలిమి బంగారం మన్బ సంస్కృతి

0 comments

జైశ్రీరామ్.

శ్లో|| దేవద్విజగురుప్రాజ్ఞ  -  పూజనం శౌచమార్జనమ్ |

బ్రహ్మచర్యమహింసా చ  -  శారీరకం తప ఉచ్యతే || 

తే.గీ.  ప్రాజ్ఞ, దేవ ద్విజుల, గురువరుల పూజ,

దేహశౌచ మహింసయు, దివ్యమైన

బ్రహ్మచర్యమున్ దపములు, వరలఁ జేయ

దగినవి భువి దేహముచేతఁ దలచి చూడ.

భావము. 

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, శరీరశుద్ధి కలిగియుండుట 

మరియు ఋజుత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శరీరముచే చేయదగిన తపస్సులని 

చెప్పబడుచున్నవి.

జైహింద్.

అర్చన కాలే రూపగతా...... మేలిమి బంగారం మన సంస్కృతి...

0 comments

జైశ్రీరామ్. 

శ్లో|| అర్చన కాలే రూపగతా సంస్తుతికాలే శబ్దగతా

చిన్తనకాలే ప్రాణగతా తత్త్వవిచారే సర్వగతా!

తే.గీ.  అర్చనము వేళ రూపంబు నమ్మ నిలుచు,

స్తోత్రమును జేయ శబ్దమై శోభిలు మదిఁ,

జింతనము సేయ ప్రాణమై చెలఁగు జనని,

తత్వమెన్నుచో సర్వంబు తానె యగును.

తా|| జగన్మాత పూజా సమయంలో ‘రూపం’ లోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’ లోనూ, 

చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’ లోనూ, తత్త్వ విచారం చేసేటప్పుడు సర్వత్రా 

గోచరిస్తుంది.

జైహింద్.

గ్రంథావిష్కరణ సభలో....

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

భక్తిసాధనం ప్రకటించిన ఏకవింశతి పురస్కారాలలో నా స్థానము.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

మంచి వ్యాసంగం వల్ల అశాంతి కలుగుతుంది. సమస్యాపూరణము. ! | Brahmasri Vaddiparthi Padmakar |...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శతావధానం,10-01-2022, शतावधानम्, SHATAVADHANAM By వద్దిపర్తి పద్మాకర్ గార... నేనిచ్చిన సమస్యకు అవధానిగారి పూరణ... అందించినవారు బ్రహ్మశ్రీ అంబాళం పార్థ సారథి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

21, ఆగస్టు 2023, సోమవారం

శ్రీ లలితా సహస్ర నామములలో690వ నామము. ఓం కోశనాథాయై నమః. Lalitha Sahasra Namalu - 4 | Chintha Ramakrishna Rao | Kumara Suryanaray...

0 comments

జైశ్రీరామ్.

690. ఓం కోశనాథాయై నమః. 691.

నామ వివరణ.

సృష్టిలోనున్న కోశాగారములకధిపతి మన అమ్మ. కోశనాథాస్వరూపిణి మన అమ్మయే.

చ.  అనుపమ! *కోశనాథ*! నిగమాంత సువేద్యవు,  నీవె కల్గుదే

యనితర రీతినన్నిటఁ బ్రియంబున మమ్ము రహింపఁజేయు ని

న్ననయము చిత్తమందు పరమార్థమునెంచి భజింతుమమ్మ, వం

దనములు స్వీకరింపుమ, ముదంబున మా మదులందు వెల్గుమా. 

నామ వివరణ.

సృష్టిలోనున్న కోశాగారములకధిపతి మన అమ్మ. కోశనాథాస్వరూపిణి మన అమ్మయే.

చ.  అనుపమ! *కోశనాథ*! నిగమాంత సువేద్యవు,  నీవె కల్గుదే

యనితర రీతినన్నిటఁ బ్రియంబున మమ్ము రహింపఁజేయు ని

న్ననయము చిత్తమందు పరమార్థమునెంచి భజింతుమమ్మ, వం

దనములు స్వీకరింపుమ, ముదంబున మా మదులందు వెల్గుమా.

జైహింద్