గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, డిసెంబర్ 2024, బుధవారం

సమస్య. *పద్యము పాతిపెట్టుడయ పండితలోకము సంతసించగన్.* దీనికి నా పూరణ.

జైశ్రీరామ్. 

ఉ.  పద్యము హృద్యమై తనరి పామరపాళిని పండితాళిగా

సద్యశపూర్ణులైతనర చక్కఁగఁ జేయును, కావినన్ సదా

హృద్యముగా మనంబుల ననేకవిధంబుల నాటునట్లుగా

*పద్యము పాతిపెట్టుడయ పండితలోకము సంతసించగన్.*

మీరుకూడా పూరించి కామెంట్ చెయ్యండి.

జైహింద్.

Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

ఓం శ్రీ మాత్రేనమః
సమస్యాపూరణం
హృద్యమునౌను పద్యములు
హృన్మతి కర్ణ రసాయనంపు సం

వేద్యములైన సన్మతిని పేర్మినొసంగెడు శైలి నొప్పినన్

గద్యపు బాణి నొప్పుచును కర్ణ కఠోరపు దుష్ట దోషపుం

పద్యము పాతిపెట్టుడయ పండిత లోకము సంతసించగన్

నమస్సులతో
డా. రఘుపతి శాస్త్రుల

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.