గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, అక్టోబర్ 2024, శుక్రవారం

సుజనాః పరోపకారం. .. మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  సుజనాః పరోపకారం - శూరాః శస్త్రం ధనం కృపణాః |

కులవత్తో మందాక్షం - ప్రాణాత్యయ ఏవ ముంచతి ||

(రసగంగాధరం)

తే.గీ.  పరులకుపకృతిన్ సుజనులు, భవ్య శస్త్ర

మును పరాక్రముల్, పిసినారి ధనము, సాధ్వి

సిగ్గును, విడువరు మృతిని చెందువరకు,

జన్మసార్ధకమగుటకు, జయనిధాన!    

భావము.  సత్పురుషులు పరోపకారాన్నీ, శూరులు శస్త్రాన్నీ, పిసినారులు ధనాన్నీ, 

కులస్త్రీలు సిగ్గునూ ప్రాణం పోయినప్పుడు మాత్రమే వదిలిపెడతారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.