జైశ్రీరామ్.
శ్లో. పక్షీణాం బలమాకాశం, - మత్స్యానా ముదకం బలణ్,
దుర్బలస్య బలం రాజా, - బాలానాం రోదనం బలమ్.
తే.గీ. పక్షులకుబలమాకాశమక్షయజ్ఞ!
మత్స్యములకుదకంబగు మహిని బలము,
బలము దుర్బలులలు రాజు, బ్రహ్మతేజ!
బలము పసివారికేడుపే, పాపరహిత!
భావము. అక్షయపదార్థ జ్ఞానము కలవాఁడా! బ్రహ్మతేజముతోనొప్పారు
ఓ మహానుభా! ఓ పాపరహితుఁడా! పక్షులకు ఆకాశమే బలము. చేపలకు
నీరే బలము. దుర్బలులకు రాజే బలము. పసివారికి ఏడుపే బలము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.