గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, అక్టోబర్ 2024, గురువారం

శ్రీ క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రులు సందర్భముగా ఆంధ్రామృతపాఠకులకు శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.

శ్రీ క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రులు సందర్భముగా ఆంధ్రామృతపాఠకులకు శుభాకాంక్షలు.

శ్రీమన్మంగళ శైలపుత్రి కృప రాశీభూతభాగ్యంబుగా

ధీమంతుల్ వరపండితుల్ సుజనులున్, దివ్యాత్ములై యోగులున్,

శ్రీమద్భారతదేశవాసులును, సృష్టన్ గల్గు జీవాళియున్

బ్రేమన్ బొందుత భక్తి తత్పరతతో, విశ్వేశు సద్దీవనన్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.