గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, సెప్టెంబర్ 2024, ఆదివారం

దేహే పాతిని కా రక్షా. .. మేలిమిబంగారం మన సంస్కృతి

 జైశ్రీరామ్.

శ్లో. దేహే పాతిని కా రక్షా - యశో రక్ష్యమపాతవత్|

తస్మాద్దేహేష్వనిత్యేషు - కీర్తి మేకా ముపార్జయేత్||

తే.గీ.  పతన దేహంబునకు రక్ష క్షితిని లేదు,

కీర్తి దేహంబునకు లేదు క్షీణత ధర,

కాన దేహంబుతో కీర్తి గాంచుటొప్పు,

శాశ్వతంబగు సత్కీర్తి చక్కఁ గనుము.

భావము. నశించునట్టి ఈ మానవదేహమునకు రక్షణ ఎక్కడ కలదు?అందువలన 

అనిత్యమైన ఈ దేహముతో నిత్యమై సత్యమై వెలుగొందు శాశ్వతమైన కీర్తిని 

మానవుడు ఆర్జించవలెను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.