గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, సెప్టెంబర్ 2024, మంగళవారం

చిత్రబంధ కవి శ్రీ పుల్లూరి మాతయ్య రచించిన కందపద్య గర్భిత నిరోష్ఠ్య చంపకమాల నాగబంధము.

 జైశ్రీరామ్.

 కందపద్య గర్భిత నిరోష్ఠ్య చంపకమాల  నాగబంధము.

నుతి సరసాలు,నీతియు ననూనరథస్థితి నారయన్, జన
స్తుతిఁగొనెడున్,సరైతిరి టుచోటు కదయ్యలు,లోకనాథయ
స్తుతి,సరసాల రీతి, నడఁజూడరయత్రసనల్,  రసాల్, దడ
ల్గతియె కదాతిశాంతిగతికాం(క్రాం)తిగ, జట్టులతోనె, తీయగాన్,
గర్భిత కందము;
సరసాలునీతియుననూ
న,రథస్థితి నారయన్,జనస్తుతిఁగొనెడున్, 
సరసాలరీతి నడఁజూ 
డ,రయత్రసనల్, రసాల్, దడల్గతియె,కదా!

-  0  0  0  -

ప్రపంచ బంధచిత్రకవన వాజ్మయంలో,
వర్తమానకాలంలో ఇదే పెద్ద బంధచిత్రం ఈబంధానికి నాకు మార్గదర్శనం 
చిదంబరక్షేత్రంలోని శిలాశాసనస్థ చిత్రబంధం.
శాసనసభా బంధం 
పేరు చతుస్సప్తతినాగబంధం(కొంత శిథిలం)
ఈ బంధాన్ని నేను చిత్రించి నా బంధచిత్రశిష్యుని ఇలాంటి బంధ చిత్రాన్ని రచించమని ఆదేశించినాను
అతడు ఈ కింది బంధచిత్రాన్ని కందాలలో రచించి, బంధంలోనా పేరు
ఉండేలానాకుఅంకితంగరచించినాడు.
అన్నారు శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు.

ఆ ద్విసప్తతి నాగబంధచిత్రం
👇

చిత్రబంధ కవి శ్రీ పుల్లూరి మాతయ్య కృతము

జైహింద్.

Print this post

1 comments:

Lokanadham చెప్పారు...

మా మిత్రులు చిత్ర బంధకవి శ్రీ పుల్లూరి మాతయ్యగారు నే రచించిన శ్రీ దేవీత్రయ శతకమును చూచి సంతసించి నా పై కంద గర్భిత నిరోష్ఠ్య చంపకమాలను స్వల్ప వ్యవధిలో వ్రాసి , నాకు వినిపించి , విశ్లేషించి తెలియజేసి నన్ను సంతృప్తి పరచి వారు ద్విగుణీకృత సంతుష్టులైనారు. వారి మూలముగా ఆంధ్రామృతము బ్లాగులో నా పేరు లోకనాథయ స్తుతి అంటూ బంధించి వారి నాగబంధ చిత్రము చిరస్థాయిగా నిలుస్తుంది . పద్య రచయితకు మరియు ఆంధ్రామృతము బ్లాగు నిర్వాహకులు గురువరేణ్యులు మాన్యులు చింతా రామకృష్ణ రావు గారికి నా కృతజ్ఞతాభినన్దన వందనములు తెలియజేయుచున్నాను . భవదీయుడు విద్య తపస్వి మామిళ్ళ లోకనాథం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.