జైశ్రీరామ్.
16. శా. విన్నన్ నీ శుభ నామమే వినవలెన్ విభ్రాంతులం బాయఁగాఁ.
గన్నన్ నీ దర హాసమే కనవలెన్ గాంచంగ మోక్షంబు. లే
కున్నన్ జన్మము వ్యర్థమే కనఁగ దీనోద్ధారకా! దేవ! శ్రీ
మన్నారాయణ! ప్రేమతోడుత మమున్ మన్నించి రక్షింపుమా.
భావము.
దీనోద్ధారకా! ఓ శ్రీమన్నారాయణా! విన్నట్లైతే మాలో క్రమ్ముకొనిన భ్రాంతులు మాసిపోవువిధముగా నీనామమే వినవలెను కదా. చూచినట్లైతే మోక్షము పొందజేయు నీ చిఱునగవే కనవలెను. ఆ విధముగకానినాడు ఈ జన్మము వ్యర్థమే సుమా. నీవే మమ్ములను చూచి,మన్నించిరక్షించుము.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.