జైశ్రీరామ్.
శ్లో. సీమంతినీషు కా శాంతా ? (సీతా)
రాజా కోఽభూత్ గుణోత్తమః ? (రామః)
విద్వద్ధిః కా సదా వంద్యా ? (విద్యా)
తత్రైవోక్తం న బుధ్యతే ||
భావము. ముత్తైదువలలో శాంతస్వభావం కలవారు ఎవరు?
గుణశ్రేష్ఠుడైన రాజు ఎవరు అయివున్నారు?
విద్వాంసులు ఎల్లపుడూ ఎవరిని వందించాలి?
దీనికి ఉత్తరం ఇక్కడే చెప్పబడింది.
ఆ.వె. సీతఁ బోలునట్టి సీమంతి నే నుత? (సీత)
రాము సాటి రాజు రహిఁ దెలుపుమ? (రామ)
విదుషుఁ డేమి కలిగి వెలుగొందెడును సద్య (విద్య)
శమును గాంచ? నుత్తరము లిచటనె.
భావము. ముత్తైదువలలో శాంతస్వభావం కలవారు ఎవరు?
గుణశ్రేష్ఠుడైన రాజు ఎవరు అయివున్నారు?
విద్వాంసుఁడు మంచి కీర్తి కనుటకు ఏమి కలిగియుండును?
ప్రతీ ప్రశ్నకు ఆయా పాదములోగల ఆద్యంతాక్షరములే సమాధానము.
వివరణ. సీతను బోలు సీమంతిని సీతయే తప్ప మరొకరు లేనందున
సమాధానము - సీత.
రాముని పోలునట్టి గుణశ్రేష్ఠుడైన రాజు రాముఁడే తప్ప మరెవ్వరూ లేనందున
సమాధానము - రామ.
విద్వాంసుఁడు మంచి కీర్తి కనుటకు ఏమి కలిగియుండుననగా
సమాధానము - విద్య.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.