గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

ఆచార్య బేతవోలుకు విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం

 జైశ్రీరామ్.

కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్పురస్కార గ్రహీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మంకు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జాతీయ సాహితీ పురస్కారాన్ని అజో విభో కందాళం ఫౌండేషన్,సంస్కృతి వారు ప్రకటించారు. తెలుగు సాహిత్యానికి అనుపమాన సేవ చేసిన వ్యాఖ్యాతుగౌరీ శంకర శిఖరం ఆచార్య బేతవోలునుసంగీత సాహిత్య నృత్య నాటక సంస్థ
సంస్కృతి గుంటూరు వారు సగౌరవంగా సత్కరించుకుంటోంది. ఇందుకోసం సెప్టెంబరు.
15 ఆదివారం సాయంత్రం 6, 30గంటలకుగుంటూరు లక్ష్మీపురంలో శ్రీ త్యాగరాజసాంస్కృతిక సంఘం వేదిక కానుంది. ఈపురస్కార ప్రదానోత్సవానికి ప్రముఖ నాటకరచయిత, విమర్శకులు శ్రీ పిన్నమనేనిమృత్యంజయరావు అధ్యక్షత వహిస్తారు. అజోవిభో కందాళం ఫౌండేషన్ ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ముఖ్య అతిధిగాపాల్గొంటారు. మహర్షి బాదరాయణ్ వ్యాససమ్మాన్ రాష్ట్రపతి పురస్కృతులు డా అడ్డంకి:శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాతి,సారస్వత కళానిధి డా వెలువోలు నాగరాజ్య లక్ష్మి ప్రసంగిస్తారు. రంగస్థల రచయిత, దర్శకులు, నటులు శ్రీ వైఎస్ కృష్ణశ్వర రావు జ్యోతిప్రకాశనం చేస్తారు. ఆచార్య బేతవోలు 1948, జూన్ 10న పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల లో అతి సామాన్య కుటుంబంలో జన్మించారు. కొవ్వూరు సంస్కృ త కళాశాలలో భాషా ప్రవీణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు పూర్తిచేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణ లో 'తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం' అంశంపై పిహెచ్.డి చేసారు. సంస్కృతాంధ్ర లలో విశేష పాండి త్యం గడించారు. ధారణకు, ఆశువుకు పరీక్ష అయిన అవధాన విద్యలో ఆరితేరారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంబొమ్మూరు సాహిత్య పీఠాధిపతిగా, హైద రాబాద్ కేంద్రీయ కేంద్రీయ విశ్వవిద్యాల యంలో ఆచార్యులుగా పనిచేసారు. సంస్కృతం నుంచి నాటకాలను ఈయన ఆను వాదం చేసారు. వ్యాఖ్యానం సమకూర్చారు. కొత్త గోదావరి వంటి పద్య కావ్యాలే కాకుండా నాటకాలూ రాసారు. దేవీ భాగన తం' వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. సాహిత్య విమర్శకులు, ఆధునికులు అర్ధం చేసుకునేలా ప్రాచీన కావ్యాలను వ్యాఖ్యానించారు.
ఆచార్య బేతవోలు 23 సంపుటాల వర్ణన రత్నాకరము వ్యాఖ్యానం వెలువరించారు. పద్యకవిత్వం, నాటకం, శతకం, అనువాదం ఆధ్యాత్మికం, అవధానం, వ్యాఖ్యానం వంటి ప్రక్రియల్లో ఆచార్య బేతవోలు కృషి విస్తరించింది. అవధాన సుధాకర, సభా సంచాలక సార్వభౌమ వంటి ఎన్నో బిరుదులు, ప్రతిభా వైజయంతిక వంటి ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. యువతరం అర్ధం చేసుకునేలా ప్రాచీన కావ్యాలను, వ్యాఖ్యానాలను సమకూరుస్తున్న ఆచార్య బేతవోలుకు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జాతీయ సాహితీ: పురస్కారాన్ని ప్రకటించడం పట్ల పలువురు సాహితీ వేత్తలు, సాహితీ అభిమానులు హర్షం వ్యక్తంచేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఆయనకు శుభాభినందనలు.

ఈ సందర్భముగా ఆచార్య డా. బేతవోలురామబ్రహ్మం మహోదయులకు నా అభినందనలు తెలియఁజేసుకొంటున్నాను.

అమ్మవారు వీరిని నిరంతరం సంతోషంగా ఉండేలా అనుగ్రహించాలని మనసారా కోరుకొంటున్నాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.