గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, సెప్టెంబర్ 2024, ఆదివారం

స్వభావేన హి తుష్యంతి. .. మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  స్వభావేన హి తుష్యంతి 

దేవ: సత్పురుషా: పితాl

జ్ఞానయస్త్వన్న పానేన

వాక్య దానేన పండితా:ll

తే.గీ.  తృప్తిగాంతురు పితరులు, దేవతలును,

మంచివారును, మనయొక్క మంచిఁ గాంచి,

జ్ఞానులకు తృప్తిపరమాన్నపానములను,

వాక్య దానమ్ముచే పొందు పండితాళి.

భావము. మంచి స్వభావముచేత దేవతలు, సజ్జనులు, తండ్రి సంతృప్తి 

చెందుతారు. బంధు మిత్రులు అన్నపానాలతో సంతుష్టులవుతారు. 

విద్వాంసులైతే చక్కని మాటలతోనే ఆనందపడతారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.