జైశ్రీరామ్.
చం. నిరతము శాంభవీ సతి గణించుచు నన్ను మహాత్ములట్లుగా,
పరమవిశాల భావ గుణభాసుర దంపతులట్లు వచ్చుచున్,
కరుణను చూపుచుండు, గుణగణ్యులు క్రొవ్విడి మాచవోలు వ
చ్చిరి తమపత్నులన్ గొని రచించిరి నాకు మనోజ్ఞ సత్కృతుల్.
ఉ. నన్ను గణించి, సత్కృతులు నాకు నొనర్పగ వచ్చినారు నే
నున్న గృహంబు శోభిలగ నున్నత భావ విశాలమానసుల్.
మన్ననతోడ క్రొవ్విడియు, మత్త సుకోకిల మాచవోలు,న
త్యున్నత భక్తియుక్తులయి, యీశ్వరి వీరల నేలుచుండుతన్.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.