జైశ్రీరామ్.
డా. అయాచితం నటేశ్వర శర్మ.
ఇతడు 1956, జులై 17న కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, రామారెడ్డి గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించాడు. 1966వరకు రామారెడ్డిలోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1967లో తిరుపతిలోని వేద సంస్కృత పాఠశాలలో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య, వ్యాకరణాలను చదివారు. 1977లో శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల నుండి వ్యాకరణ శిరోమణి పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ఇతడు కామారెడ్డిలోని ప్రాకృత విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా అడుగుపెట్టారు. ప్రస్తుతం అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. సంస్కృతాంధ్ర భాషలలో రచనలు చేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగాఉండేవారు.జాతీయసాహిత్యపరిషత్తు, హితసాహితి వంటి సాహిత్యసంస్థలలో కీలక పదవులలో సాహిత్య వికాసానికి కృషి చేశారు.ఎందరో యువకవులకు మార్గదర్శనం చేసి కవులుగా తీర్చిదిద్దారు.సంస్కృతంలో,తెలుగులో అష్టావధానాలు,శతావధానాలు చేశారు.
వీరి రచనలు 50కి పైగానే ఉన్నాయి.
వసంత కుమారి
శ్రీ గజానన స్తోత్రమ్
శ్రీ షోడశీ
భారతీప్రశస్తి
ఆముక్తమాల్యద పరిశీలనము
ఋతుగీత
శ్రీ శివమహిమ్నస్తోత్రవ్యాఖ్య
సమయ విలాసిని
నవ్యగీతి
బాలరామాయణము
కవితాశతకము
నవ్యనీతి శతకము
శ్రీ రాజేశ్వరశతకము
శ్రీ గణేశశతకము
శ్రీ మాతృకావర్ణమాలికా
శ్రీ రామగుణమణిమాల
ఆంధ్రతేజం
భారతీయ శతకము
ఆరురుచుల ఆమని
పంచశరీయమ్
వాణీశతకము
శ్రీకాలభైరవ సుప్రభాతమ్
శ్రీలలితాంబికాశతకమ్
లాస్యం
తాండవం
శ్రీ భీమేశ్వరశతకము
ప్రభాకరశతకమ్
లక్ష్మీధర వ్యాఖ్యానవైభవము
లక్ష్మీవిలాసము
భాగవతకథామృతం
సౌదామనీ విలాసము
రథాలరామారెడ్డిపేట
చైత్రరథం
జీవనయానము
పురుషార్థవివేచనం
నూటపదహారు
సిరినోము
చుక్కలు
శ్రీరామలింగేశ్వర హృదయము
ఆటవెలది
శతపత్రం
కాపర్తి వేంకటేశ్వర సుప్రభాతమ్
సంకష్టహర గణేశ నక్షత్రమాలిక
పంచతంత్ర కథామంజరి
శ్రీరేణుకా సుప్రభాత వ్యాఖ్య
శ్రీ గణపురాంజనేయ స్తుతి వ్యాఖ్య
శ్రీ వేంకటేశ్వర విలాసము
శ్రీమద్భాగవత దశమస్కంధానువాదం
రమణీయ శ్లోకం - కమనీయ భావం
శకుంతల
బిరుదులు
కవిరత్న
అవధానిశిరోమణి
మహోపాధ్యాయ
అందుకున్న పురస్కారాలు.
1977 - హైదరాబాద్ కళాసాహితి వారి రాష్ట్రస్థాయి ఉత్తమ కవితా పురస్కారం
1979 - వేములవాడ కళాభారతి వారి రాష్ట్రస్థాయి సాహిత్యవిమర్శ పురస్కారం
1980 - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ రజతోత్సవాలలో భాగంగా ఉత్తమ కవితా పురస్కారం
1983 - భారతీప్రశస్తి కవితా సంపుటికి జాతీయ సాహిత్య పరిషత్తు పురస్కారం
1994 - సంస్కృతంలో ఉత్తమ సాహిత్య పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి నుండి స్వర్ణపతకం.
2002 - గరిశకుర్తి సాహితీ పురస్కారం
2005 - స్పందన సాహితి, రాయగడ (ఒరిస్సా) వారి ఉత్తమ కవితా పురస్కారం
2005 - నిజామాబాద్ జిల్లా ఉగాది ఉత్సవాలలో అవధాన పురస్కారం
2009 - రంజని - విశ్వనాథ జాతీయ పద్యకవితా పురస్కారం
2010 - శోభనాథ్‌సింహ్ కవితా పురస్కారం
2011 - కిన్నెర కుందుర్తి వచనకవితా పురస్కారం
2011 - రాష్ట్రకవి ఓగేటి సాహిత్య పురస్కారం
2012 - ప్రపంచ తెలుగు మహాసభలలో జిల్లా ఉత్తమకవి పురస్కారం
2012 - పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి అవధాన కీర్తి పురస్కారం
2014 - తేజ ఆర్ట్ క్రియేషన్స్, ఆలేరు వారి తేజ పురస్కారం
2016 - తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015) - తెలుగు విశ్వవిద్యాలయం, 20 డిసెంబరు 2O16.
2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ ఊపురస్కారం 2016 (శకుంతల పుస్తకానికి)
2023 - దాశరథి సాహితీ పురస్కారం (తెలంగాణ ప్రభుత్వం)
ఇట్టి మహనీయులు కాలధర్మం చెందుట సంస్కృతాంధ్ర సాహితీ జగత్తుకు తీరని లోటే. ఈ మహనీయునికి ఉత్తమ గతులు ప్రాప్తించుగాక.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.