జైశ్రీరామ్.
శ్లో. నారాయణో నామ నరో నరాణాం
ప్రసిద్ధ చౌరః కథితః పృథివ్యామ్ |
అనేక జన్మార్జితపాపసంచయం
హరత్యశేషం స్మరతాం సదైవ ||
(పాండవగీత)
తేగీ. నరుఁడు నారాయణాఖ్యుఁడు ధరను జనులు
స్మరణ చేసిన మాత్రాన నిరుపమముగ
దోఁచు నార్జిత పాపముల్, దొంగయతఁడు,
మదులలో దాగియుండును, వెదకి కనుఁడు.
భావము. నారాయణ అనే ఒక మనిషి అత్యంత ప్రసిద్ధి చెందిన దొంగగా
లోకంలో చెప్పబడుతున్నాడు. ఎవరైనా అతన్ని ఒకసారి స్మరిస్తే చాలు,
వారి అనేక జన్మల పాపఫలాలను అతను ఆ క్షణంలోనే పూర్తిగా
అపహరిస్తాడని అంటారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.