గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, సెప్టెంబర్ 2024, బుధవారం

ఉత్తిష్ఠమానస్తు పరో - .. మేలిమబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  ఉత్తిష్ఠమానస్తు పరో - నోపేక్ష్యః పథ్యమిచ్ఛతా |

సమౌ హి శిష్టైరామ్నాతౌ - వర్త్స్యంతావామయః స చ ||

(శిశుపాలవధ)

తే.గీ.  ఎదుగు చున్నట్టి దుష్టుని యెదుగుదలను

మంచితోనాపవలె, వేచి మించనీక,

పెరుగువ్యాధియు శత్రువు ధరను హాని

మనకు గొలుపుననెడు మాట మరువరాదు.

భావము.  హితాన్ని కోరేవాడు బలిష్ఠుడవుతున్న శత్రువును నిర్లక్ష్యం చేయకూడదు. 

పెరుగుతున్న వ్యాధి మరియు పెరుగుతున్న శత్రువు ఇద్దరూ హానికరంగా 

ఉండటంలో సమానమని ఉత్తములు భావిస్తారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.