జైశ్రీరామ్.
శ్లో. అత్యల్పమపి సాధూనాం - శిలా లేఖతి తిష్టతి।
జల లేఖేన నీచానాం - యత్ కృతం తత్ వినశ్యతి॥
తే.గీ. సాధు జనులకు చేసెడ దేదియైన
రాతిపై వ్రాతవలె నిల్చు ధాత్రిపయిన,
నీచులకు చేయునుపకృతి నీటిపైన
వ్రాతవలెమాయునప్పుడే, భవ్యులార!
(రాతి - ధాత్రి.సంయుతాసంయుత ప్రాస)
భావము. సజ్జనులకు చేసిన ఏ చిన్న ఉపకారమైనా అది రాతిమీద గీసిన గీతలా
ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కొంచెము ఉపకారానికే వారు ఎల్లప్పుడూ
కృతజ్ఙులై ఉంటారు. మరి నీచులున్నారే, వారికి ఎంత పెద్ద మేలు చేసినప్పటికీ
నీటిమీద గీసిన గీతలా అది అప్పుడే నశించిపోతుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.