గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జనవరి 2023, ఆదివారం

రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం..... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో. రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం విగచ్ఛతి / 

మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి // (ఉమాసంహిత)


కం.  రాయని పలికిన పాపము 

మాయంబగు పుణ్యమబ్బు,మహిమాన్వితమౌ

మాయని పలికిన యంతనె

ఖాయంబుగమరలి రావు కలుషములు సుధీ!


భావము.

రా‘ అను శబ్దం ఉచ్చరించగానే పాపం వదనమునుండి బయటపడును. 

పిదప ‘మ‘కారము వినుటతోడనే భస్మమైపోవును

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.