గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2023, సోమవారం

న హి దేహభృతా శక్యం - ...18 - 11...//... అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం - ...18 - 12,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

 జైశ్రీరామ్.

శ్లో హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః|

యస్తు కర్మఫలత్యాగీ త్యాగీత్యభిధీయతే||. || 18-11 

తే.గీ. కర్మలను వీడుటన్నది కాయమున్న

వానికెన్న నసాధ్యము, వాడు కర్మ

ఫలములను వీడ త్యాగిగా వరలునవని,

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

దేహధారికి కర్మలన్నింటిని త్యజించడం సాధ్యం కాదు. కర్మ ఫలాన్ని త్యజించి

వాడే త్యాగి అనిపించుకుంటాడు.

శ్లోఅనిష్టమిష్టం మిశ్రం త్రివిధం కర్మణః ఫలమ్|

భవత్యత్యాగినాం ప్రేత్య తు సంన్యాసినాం క్వచిత్. || 18-12 ||

తే.గీ. మంచి, చెడు,మిశ్ర ఫలములు మహిని కర్మ

లకులభించునత్యాగికిప్రకటితముగ

నంతమందున, త్యాగుల కంటవయ్య,

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

కర్మ ఫలం దుష్టమైనవి, మంచివి, మిశ్రమమైనవి అని మూడు విధాలైన 

కర్మ ఫలాలు త్యాగులు కాని వారికి మరనణానంతరం లనభిస్తాయిఅవి సన్యాసులకి 

కొంచం కూడా రాదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.