గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జనవరి 2023, శుక్రవారం

శరీరవాఙ్మనోభిర్యత్కర్మ - ...18 - 15...//... తత్రైవం సతి కర్తారమాత్మానం - ...18 - 16,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

 జైశ్రీరామ్.

శ్లోశరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః|

న్యాయ్యం వా విపరీతం వా పఞ్చైతే తస్య హేతవః. || 18-15 ||

తే.గీత్రికరణములతో చేయు మంచికి, చెడునకు,

కారణంబగు నీయైదు కనుము మదిని,

తెలియ వలయును సుజ్ఞాన తేజమొదవ

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

మంచిది కాని, చెడ్డది కాని మానవుడు మనో వాక్కాయములతో కర్మ చేసినా దానికి 

అయిదు కారణమౌతాయి

శ్లోతత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః|

పశ్యత్యకృతబుద్ధిత్వాన్న పశ్యతి దుర్మతిః. || 18-16 ||

తే.గీవిషయ మిటులుండ నజ్ఞాను లసలు కనరు,

తామె కర్తగా భావింత్రు ధరణిపైన,

విషయమును గన జాలరు విశ్వమునను.

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

విషయం ఇలా ఉండగా, అపరిపక్వమైన బుద్ధితో కేవలం తానే కర్తననుకునే మూర్ఖుడు 

తెలివి తక్కువ తనం వలన సరిగా గ్రహించడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.