గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జనవరి 2023, బుధవారం

తదిత్యనభిసన్ధాయ ఫలం - ...17 - 25...//... సద్భావే సాధుభావే చ - ...17 - 26,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

 జైశ్రీరామ్.

శ్లోతదిత్యనభిసన్ధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః|

దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాఙ్క్షిభిః. || 17-25 ||

తే.గీ. తత్తటంచు మోక్షార్థులు చిత్తమలర

కాంక్షలను వీడి, యజ్ఞ సత్కార్యములను

తపములను చేయుచుందురు, ధర్మమరసి,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

"తత్"అంటూ మోక్షాన్ని కాక్షించే వారు ఫలం ఆశించకుండా, వివిధాలైన యజ్ఞాలూ, తపస్సులూ చేస్తుంటారు.

శ్లోసద్భావే సాధుభావే సదిత్యేతత్ప్రయుజ్యతే|

ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. || 17-26 ||

తే.గీసత్యమునకు మంచికి వాడు సత్పదంబు,

మంచి కర్మలకునువాడు మంచి దెలుపు

సత్ పదంబునో యర్జునా! సత్యమిదియె

నీవుగ్రహియింమియ్యది నేర్పు మీర.

భావము.

పరమసత్యానికీ, మంచితనానికి సూచనగా "సత్"అనే పదాన్ని ప్రయోగిస్తారు

అర్జునా! మంచి కర్మలకు కూడా"సత్"అనే పదం ప్రయోగింప బడుతుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.