గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జనవరి 2023, శుక్రవారం

జ్ఞానం కర్మ చ కర్తాచ త్రిధైవ - ...18 - 19...//... సర్వభూతేషు యేనైకం - ...18 - 20,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

 జైశ్రీరామ్.

శ్లోజ్ఞానం కర్మ కర్తాచ త్రిధైవ గుణభేదతః|

ప్రోచ్యతే గుణసఙ్ఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి. || 18-19 ||

తే.గీ. జ్ఞానమును, కర్మ, కర్తయు, కనగ గుణవి

భేదమునుబట్టి మూడేసి విధములనుచు,

గుణపు సంఖ్యాన వివరించె కూర్మితోడ

వినుము శ్రద్ధగా నీవిది ఘనతరముగ.

భావము.

జ్ఞానం, కర్మ, కర్త- మూడూ గుణ భేధాలని బట్టి మూడేసి విధాలని, గుణాలకు సంబంధించిన సౌఖ్యంలో చెప్పబడినది. అందులో ఉన్నదానిని విను.

శ్లోసర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే|

అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్త్వికమ్. || 18-20 ||

తే.గీ. నాశరహితమౌ సత్తు కనంగ నొకటె,

యన్ని ప్రాణుల నవిభక్తమై రహించు

ననుచు గ్రహియించుసాత్వికమనుపమముగ,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

అన్ని ప్రాణులలోనూ నాశనం లేని ఒకే సత్తు ఉన్నదనీ, భిన్నమైన వాటిలో అది 

అవిభక్తంగా ఉన్నదనీ గ్రహించేది సాత్విక జ్ఞానమని తెలుసుకో.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.