గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2023, సోమవారం

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం - ...18 - 5...//... ఏతాన్యపి తు కర్మాణి సఙ్గం - ...18 - 6,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

 జైశ్రీరామ్.

శ్లోయజ్ఞదానతపఃకర్మ త్యాజ్యం కార్యమేవ తత్|

యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్. || 18-5 ||

తే.గీ. యజ్ఞ దాన తపఃకర్మ లజ్ఞులగుచు

మాన కాచరింప వలయు, దాన యజ్ఞ

తపము లిల వివేకులకును, ధరను శుద్ధి

చేయుటను నీవెరుంగుము, చిత్తమలర,

భావము.

యజ్ఞ దాన తపః కర్మలను మానరాదు. చేయవలసినదే. వివేకులను శుద్ధం చేసేది 

యజ్ఞ దాన తపస్సులే.

శ్లోఏతాన్యపి తు కర్మాణి సఙ్గం త్యక్త్వా ఫలాని |

కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్. || 18-6 ||

తే.గీచేయు నీకర్మలన్నిటిన్ చేయ వలయు

సంగ, ఫలితంబులను వీడి, సన్నుతమతి,

నాదు మతమిది, యుత్తమమైధరణిని

యొప్పు గ్రహియింపుమియ్యది యొప్పిదముగ.

భావము.

అర్జునా! కర్మలను కూడా సంగాన్ని, ఫలాన్ని వదిలి చెయ్యాలని నా నిశ్చితమైన 

ఉత్తమమైన అభిప్రాయం..

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.