గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జనవరి 2023, సోమవారం

యత్తు ప్రత్యుపకారార్థం - ...17 - 21...//...అదేశకాలే యద్దానమ - ...17 - 22,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

 జై శ్రీరామ్.

శ్లో.  యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః|

దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్. || 17-21 ||

తే.గీ.  ప్రతిఫలార్థమో, ఫలముకో, బాధపడుచు

తాను బలవంతముగ చేయు దానమరయ

రాజసికమగు, రమణీయ రాజవదన!

నీవుగ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

ప్రత్యుపకారం ఊద్దేశించిగాని, ఫలాన్ని ఆశించిగాని, బలవంతంగానూ, 

భాధపడుతూ ఇచ్చే దానిని రాజసిక దాన మంటారు

శ్లో.  అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే|

అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్. || 17-22 ||

తే.గీ.  ధర నపాత్రున, కహితమౌ సరణి, కాని

వేళ, నవమానపరచుచు, వినగరాని

విధముగాదానమును చేయ ప్రీతి గనుమ

తామసికదానమదియౌను, తలచి చూడ.

భావము.

అపాత్రునికి, తగని తగని సమయంలో, ఇవ్వకూడని చోట, అగౌరవంతో, అవమానిస్తూ ఇచ్చేది తామసిక దానమని చెప్పబడుతుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.