గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జనవరి 2023, ఆదివారం

త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ - ...18 - 3...//... నిశ్చయం శృణు మే తత్ర - ...18 - 4,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

 జైశ్రీరామ్.

శ్లోత్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః|

యజ్ఞదానతపఃకర్మ త్యాజ్యమితి చాపరే. || 18-3 ||

తే.గీదోషకరమగు కర్మలన్ తొలగవిడువ

వలెననందురుకొందరు, పండితులిల,

యజ్ఞ దాన తపః కర్మ లజ్ఞులగుచు

విడువరాదంద్రు కొందరు విజయ వినుమ.

భావము.

దోషం కల కర్మలని వదలాలని కొందరు పండితులంటారుయజ్ఞ దాన తపః కర్మలని 

వదలరాదని కొందరు అంటారు.

శ్లోనిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ|

త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సమ్ప్రకీర్తితః. || 18-4 ||

తే.గీ. భరతవంశజశ్రేష్ఠుడా! పార్థ! పురుష

వ్యాఘ్రమా! విను మీవిషయంబుపైన

నాదు నిర్ణయమున్ త్యాగ మీధరిత్రి

మూడు విధములుగా చెప్ప బొసగునయ్య.

భావము.

భరత శ్రేష్టుడా! విషయంలో నా నిర్ణయాన్ని విను. పురుష వ్యాఘ్రమాత్యాగం మూడు 

విధాలని చెప్ప బడుతుంది.,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.