గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2023, బుధవారం

సురగవి ప్రాశస్త్యము.చిత్ర బంధ గర్భ కవితా సమాహారము. గోమాత సురభికి ఊంజల్ సేవ.

 

శ్రీరస్తు.

సురగవి - నవరత్నమాలిక.

రచన. చింతా రామకృష్ణా రావు.శా. శ్రీదంబున్, జయదంబు, కామితదమున్, శ్రీ దివ్య ధేనూల్లస

ద్బోధోద్భావిత భాషణంబు. సుజనుల్ పూజింతు రా ధేనువున్,

వేదోక్తంబగు దివ్య తేజమమరున్ విశ్వంబునన్ ధేనువున్

మోదంబున్ పరిచర్య చేసి కొలువన్, పుణ్యంబు ప్రాప్తించెడున్.     .

భావముశ్రీకరమైనట్టి దివ్యస్వరూపియైన గోవునకు సంబంధించి వ్యక్తపరచెడి బోధనతో ప్రకాశించెడి సంభాషణము మనకు

లక్ష్మీప్రదమును, జయప్రదమును, కామితములు తీర్చునదియును అగును. అట్టి ధేనువును సజ్జనులైనవారు పూజింతురు.

లోకములో గోవును మోదముతో సేవించుచు కొలుచుచున్నచో  వేదమునందు చెప్పఁబడిన దేవతా వర్చస్సు మనకు తప్పక

కలుగును. పుణ్యము కలుఁగును.

 

ఆటవెలది ద్వయ గర్భ సీసము.  ( ప్రహేళిక )

విశ్వమెల్లఁ బొగడు విలువల నేమంద్రు? - దధిని చిలుక వచ్చునది. యదేది?

చందమామ పయిన సతతమున్ గలదేది? - మనిషి నిల్చునెచట మసలుటకును.?

జ్ఞానముననునొప్పు జగతిలోనేజీవి? - జీవితమ్మున తుది చెలగునెద్ది?

ఉత్తరములు మూడు నొప్పగువర్ణముల్, - మొదటి వర్ణములను మునులు ప్రబలు

తే.గీ. గోమతీనది తీరాన కుంభినిపయి - నలరుచున్నట్టి సన్మాన్య సులలిత వన

రాజమచటను సురధేనురాజమొప్పె. -  దివిజ తేజోవిరాజి యా దివ్యసురభి.     .

సీస గర్భస్థ ఆటవెలది .

విశ్వమెల్లఁ బొగడు విలువల నేమంద్రు? - దధిని చిలుక వచ్చునది. యదేది?

చందమామ పయిన సతతమున్ గలదేది? - మనిషి నిల్చునెచట మసలుటకును.?

సీస గర్భస్థ ఆటవెలది .

జ్ఞానముననునొప్పు జగతిలో నేజీవి? - జీవితమ్మున తుది చెలగునెద్ది?

ఉత్తరములు మూడు నొప్పగువర్ణముల్, - మొదటి వర్ణములను మునులు ప్రబలు

సీస పద్య భావము.

. ప్రపంచమంతా పొగడు విలువలను ఏమంటారు?

. పెఱుగును చిలికినచో మనకు ఏది వచ్చును?

. చందురునిపై నిత్యము ఉండునదేది?

. మనిషి మసలుటకు ఎచట నిలుచును?

. ప్రపంచములో జ్ఞానముతోనొప్పెడి జీవి ఏది?

. జీవితము చివరి భాగములో వచ్చెడిది ఏది?

ప్రశ్నలకు చెప్పెడి సమాధానములు మూడేసి అక్షరములు కలిగి యుండును. వాటి మొదటి వర్ణములన్నియు కలుపగా

వచ్చెడి పదము మునులకు నిలయమైనది. అది భూమిపై గోమతీనది తీరమున గొప్పవారిచే ప్రశంసింపఁబడెడి

సులలితమైన మహద్వనము. అచట గొప్ప దేవతా ధేనువు ఉండెను. దివ్య సురభి దేవ లోకమున వెలిఁగెడి తేజస్సుతో

ప్రకాశించుచుండెను.

శా. ధర్మంబే వర ధేను రూపమయి బోధన్ గొల్పఁగా వచ్చి, సత్

కర్మల్ చేయఁగ, పంచగవ్యములు సాకల్యంబుగా నిచ్చె నే

మర్మంబున్ దరి చేరనీక, క్రతువుల్ మాన్యుల్ ధృతిన్ జేయఁగన్.

నైర్మల్యంబయి లోకమొప్పు. బ్రకృతిన్ నర్తించు సత్ సంపదల్.     .

భావము. ధర్మ దేవతయే ధేనువు రూపములో లోకులను ప్రబోధింప వచ్చెను. లోకులు మంచి పనులు చేయుట కొఱకు తాను

పంచగవ్యములను సంపూర్ణముగా యిచ్చెను ఎటువంటి మాయకు లోను కాకుండా మాననీయులు క్రతువులను పూనికతో

చేసినచో లోకము నిర్మలముగా ప్రకాశించును. ప్రకృతి సంపూర్ణమైన మంచి సంపదలతో నొప్పారియుండును.

. నైతిక మను మిసిమిఁ బడసె, - ఖ్యాతిగ హృది దధిని చిలుక, గగన శశభృతిన్

భాతిగ వెన్నెల కురియఁగ - భూతిని గనె వసుధ నరుఁడు. ముదిమిని మరిచెన్,     .

భావము. మానవుఁడు హృదయమనెడి దధిని చిలుకుట మూలమున నైతికము అనెడి మిసిమిని పొందెను. ఆకసమునందలి

చందురుఁడు ప్రకాశముగా వెన్నెల కురియుచుండఁగా భూమిపై గల నరుఁడు పవిత్రత గాంచెను. వృద్ధాప్యమన్నదే

మరచిపోయెను.

అనేక ద్వివిధ కంద - గీత గర్భ చంపక మాల.

క్షితి నసమానమా గవి. సుసేవ్యసమంచిత కాంతులెన్న వా

ఙ్మతి మసలున్ సదా వినుత మౌని సమీప్సిత వేద బోధ నే

క్షితి ధిషణాఢ్య సత్ కవుల శేముషిఁ గొల్పెడు కావ్య భాసమున్

నుత వసుధన్ గనన్ బ్రకృతి నోము సముద్భవ భవ్యభాగ్యమున్. .

అనేక ద్వివిధ కంద - గీత గర్భ చంపక మాల భావము.

సురగవి భూమిపై సాటి లేనిది. మంచిగా సేవింపఁబడెడి దాని తెజస్సులనెన్ని చూచినచో మాటల మనమున

సంచరించును. ఇది ఎల్లప్పుడు మునులకు ప్రీతికరమైన వేదమునకు సంబంధించిన బోధనమే. భువిపై

జ్ఞానప్రపూర్ణులయిన మంచి కవుల జ్ఞానముతో కొలిపెడి కావ్యముప్రకాశము. పొగడఁబడెడి భూమిని చూచినచో ప్రకృతి యొక్క

నోములు కారణముగా సముద్భవించిన గొప్ప భాగ్యమే యగును.

 

చంపక మాల గర్భస్థ ద్వివిధ కందము .

అసమానమా గవి. సుసే

వ్య సమంచిత కాంతులెన్న వాఙ్మతి మసలున్,

ధిషణాఢ్య సత్ కవుల శే

ముషిఁ గొల్పెడు కావ్య భాసమున్ నుత వసుధన్,

 

ధిషణాఢ్య సత్ కవుల శే

ముషిఁ గొల్పెడు కావ్య భాసమున్ నుత వసుధన్,

అసమానమా గవి. సుసే

వ్య సమంచిత కాంతులెన్న వాఙ్మతి మసలున్,

 

చంపక మాల గర్భస్థ ద్వివిధ కందము .

మసలున్ సదా వినుత మౌ

ని సమీప్సిత వేద బోధనే క్షితి ధిషణా!

వసుధన్ గనన్ బ్రకృతి నో

ము సముద్భవ భవ్యభాగ్యమున్ క్షితినసమా!

 

వసుధన్ గనన్ బ్రకృతి నో

ము సముద్భవ భవ్యభాగ్యమున్ క్షితినసమా!

మసలున్ సదా వినుత మౌ

ని సమీప్సిత వేద బోధనే క్షితి ధిషణా!

 

చంపక మాల గర్భస్థ ద్వివిధ కందము .

అసమానమా గవి. సుసే

వ్య సమంచిత కాంతులెన్న వాఙ్మతి మసలున్,

మసలున్ సదా వినుత మౌ

ని సమీప్సిత వేద బోధనే క్షితి ధిషణా!

 

మసలున్ సదా వినుత మౌ

ని సమీప్సిత వేద బోధనే క్షితి ధిషణా!

అసమానమా గవి. సుసే

వ్య సమంచిత కాంతులెన్న వాఙ్మతి మసలున్,

 

చంపక మాల గర్భస్థ ద్వివిధ కందము .

అసమానమా గవి. సుసే

వ్య సమంచిత కాంతులెన్న వాఙ్మతి మసలున్,

వసుధన్ గనన్ బ్రకృతి నో

ము సముద్భవ భవ్యభాగ్యమున్ క్షితినసమా!

 

వసుధన్ గనన్ బ్రకృతి నో

ము సముద్భవ భవ్యభాగ్యమున్ క్షితినసమా!

అసమానమా గవి. సుసే

వ్య సమంచిత కాంతులెన్న వాఙ్మతి మసలున్,

 

చంపక మాల గర్భస్థ ద్వివిధ కందము .

ధిషణాఢ్య సత్ కవుల శే

ముషిఁ గొల్పెడు కావ్య భాసమున్ నుత వసుధన్,

మసలున్ సదా వినుత మౌ

ని సమీప్సిత వేద బోధనే క్షితి ధిషణా!

 

మసలున్ సదా వినుత మౌ

ని సమీప్సిత వేద బోధనే క్షితి ధిషణా!

ధిషణాఢ్య సత్ కవుల శే

ముషిఁ గొల్పెడు కావ్య భాసమున్ నుత వసుధన్,

 

చంపక మాల గర్భస్థ ద్వివిధ కందము .

ధిషణాఢ్య సత్ కవుల శే

ముషిఁ గొల్పెడు కావ్య భాసమున్ నుత వసుధన్,

వసుధన్ గనన్ బ్రకృతి నో

ము సముద్భవ భవ్యభాగ్యమున్ క్షితినసమా!

 

వసుధన్ గనన్ బ్రకృతి నో

ము సముద్భవ భవ్యభాగ్యమున్ క్షితినసమా!

ధిషణాఢ్య సత్ కవుల శే

ముషిఁ గొల్పెడు కావ్య భాసమున్ నుత వసుధన్,

 

చంపక మాల గర్భస్థ ద్వివిధ కందము .

అసమానమా గవి. సుసే

వ్యసమంచిత కాంతులెన్న వా? క్షితి నసమా!

మసలున్ సదా వినుత మౌ

ని సమీప్సిత వేద బోధ నే మతి మసలున్.

 

మసలున్ సదా వినుత మౌ

ని సమీప్సిత వేద బోధ నే మతి మసలున్.

ఆసమానమా గవి. సుసే

వ్యసమంచిత కాంతులెన్న వా? క్షితి నసమా!

 

చంపక మాల గర్భస్థ ద్వివిధ కందము .

అసమానమా గవి. సుసే

వ్యసమంచిత కాంతులెన్న వా? క్షితి నసమా!

ధిషణాఢ్య సత్ కవుల శే

ముషిఁ గొల్పెడు కావ్య భాసమున్ క్షితి ధిషణా!

 

ధిషణాఢ్య సత్ కవుల శే

ముషిఁ గొల్పెడు కావ్య భాసమున్ క్షితి ధిషణా!

నసమానమా గవి. సుసే

వ్యసమంచిత కాంతులెన్న వా? క్షితి నసమా!

 

చంపక మాల గర్భస్థ ద్వివిధ కందము .

అసమానమా గవి. సుసే

వ్యసమంచిత కాంతులెన్న వా? క్షితి నసమా!

వసుధన్ గనన్ బ్రకృతి నో

ము సముద్భవ భవ్యభాగ్యమున్ నుత వసుధన్.

 

వసుధన్ గనన్ బ్రకృతి నో

ము సముద్భవ భవ్యభాగ్యమున్ నుత వసుధన్.

అసమానమా గవి. సుసే

వ్యసమంచిత కాంతులెన్న వా? క్షితి నసమా!

 

చంపక మాల గర్భస్థ తేటగీతి.

గవి సుసేవ్యసమంచిత కాంతులెన్న

వినుత మౌని సమీప్సిత వేద బోధ.

కవుల శేముషిఁ గొల్పెడు కావ్య భాస.

బ్రకృతి నోము సముద్భవ భవ్యభాగ్య.

 

శ్రీచక్ర బంధ తేటగీతి.

కలుఁగుఁ గావుతశ్రీ ధేనుకా ప్రసాద. -  లక్ష్య సంసిద్ధి సుశ్రీఫలంబు నిడుత

సిరులు పండించు శ్రీ విద్యఁ జేర్చి బ్రోచు - కమలవాసిని దక్షతఁ గాచునింక.     .

 

శ్రీచక్ర బంధ తేటగీతి

భావముధేనుకా ప్రసాదిత లక్ష్య సంసిద్ధి కలుగును గాక. మంచి లక్ష్మీప్రదమయిన ఫలితములను కలుఁగఁ జేయును గాక.

మంగళమహాశ్రీలు ఫలింపఁ జేసే శ్రీవిద్యవైపు మనసును కేంద్రీకరింపఁ జేసి కమల వాసిని మనలను దక్షతగా నిలిచి

కాపాడునుగాక.

చతురంగ బంధ లఘు కందము

సురగవి - చదివిన - శుభములు - కలుగునుసదమల సుచరిత కలిగిన

బుధునకు మనసు వెలుగు నుతముగ రవి కరణిన్.

సుధగవి కలుముల నిడుభువి

నది భవమగు చదివిన శుభ నయతలు గొలుపున్.     .

భావము. మంచి నిర్మలమైన మంచి నడవడిక కలిగినట్టి

విద్వాంసునకు పొగడఁబడు విధముగ సూర్యుని వలె మనసు

ప్రకాశించును. భూజనులు అమృత మూర్తియైన యీ సుర గవిని

చదివినచో సంపదలను ప్రసాదించును. నీతిని కలుగఁ

జేయును.

 

విరోధాభాసాలంకృత చంపకమాల.

సురగవి కల్గినన్ ధరణి శోభిలు పాపుల దుష్ట చేష్టలన్,

పరిహరణంబు సేయు వర భక్త శిఖామణులన్, మహాత్ములన్,

సురుచిర కావ్యముల్ వెలయు  జూదరపాళి దురోదరాళిచేన్,

బురసతి బాధలొందు నటు బుద్ధికి కానఁగరావసంగతుల్.     .

భావము. దేవతా స్వరూపమైన సురగవి ఉన్నచో అచ్చట

పాపులు తమ చెడు ప్రవర్తనలతో శోభిల్లుచుందురు.

మహాత్ములను, శ్రేష్టులైన భక్త శిఖామణులను పరిహరించును.

గూదరుల సమూహము చేత, దురోదరుల సమూహము చేత

మంచి ప్రకాశవంతమయిన కావ్యములు వెలయును.బురమనెడి కాంత బాధలనుభవించును. అక్కడ అసంగతములు ఎవరి

మనసునకు చేరవు.

అని సురగవిని గూర్చి అనుచితముగు విధముగా మనకు కనఁబడుచున్నది.

కాని

యదార్థమునకు పదచ్ఛేదములందు చిన్న మార్పుతో క్రింది విధమగు భావము ప్రస్ఫుటమగును.

యథార్థగా భావముదేవతా స్వరూపమైన సురగవి ఉన్నచో భూదేవి శోభిల్లును. పాపకార్యములు చేయువారి దుర్మార్గపు

చేష్టలను నివారణ చేయును. శ్రేష్టులైన భక్త శిఖామణులచేతను, మహాత్ముల చేత మంచి ప్రకాశవంతమైన కావ్యములు

వెలయును. జూదరుల చేత, దురోదరుల చేత భూమి బాధపడుచున్నదనెడి అసంగతులే ఎవరికీ కానిపింపనుండవు.

 

. శుక పిక శారికా వితతి శ్రోత్ర మనోజ్ఞ ప్రబంధ సద్ధ్వనుల్

ముకుళిత హస్తులై బుధులు పొంగుచు పల్కెడి వేద పాఠముల్,

సకల శుభాస్పదాద్భుత వసంత సమంచిత భామినీమణుల్,

ప్రకటన చేసెడిన్ గవి ప్రభావము భారత భూమి నెల్లెడన్.     .         

భావము. చిలుకలయొక్క, కోయిలలయొక్క, గోరువంకలయొక్క సమూహము చేయుచున్న చెవులకింపయిన ప్రకృష్టమయిన

బంధము కలిగిన మంచి ధ్వనులు, చేతులు ముడుచుకొనియుండి పండితులు ఉప్పొంగుచు పలికెడి వేదపాఠములు,

సమస్తమయిన శుభములకాస్పదమయిన వసంతముత ఋతుశోభతోనలరారుచున్నకాంతామణులు, సురగవి ప్రభావమును

భారత భూమినెల్లెడలను ప్రకటన చేయుచుండెను.

స్వస్తి.

శ్రీ మన్మధ నామ సంవత్సరమ్, ఆషాఢ బహుళ పంచమి. తే.14 - 7 - 2017.

వివరణము.

౨వ పద్యము. ఆటవెలది ద్వయ గర్భ సీసము. ( ప్రహేళిక )

1. విశ్వమెల్ల పొగడు విలువల నేమంద్రు?

సమాధానము (నైతిక)

2. దధిని చిలుక వచ్చునది. యదేది?

సమాధానము (మిసిమి)

3. చందమామ పయిన సతతమున్ గలదేది?

సమాధానము (శశము)

4. మనిషి నిల్చునెచట మసలుటకును.?

సమాధానము (వసుధ)

5. జ్ఞానముననునొప్పు జగతిలో నేజీవి?

సమాధానము (నరుఁడు)

6. జీవితమ్మున తుది చెలగునెద్ది?

సమాధానము (ముదిమి)

ఉత్తరములు మూడు నొప్పగువర్ణముల్,

మొదటి వర్ణములను మునులు ప్రబలు.

తే.గీ. గోమతీనది తీరాన కుంభినిపయి - నలరుచున్నట్టి సన్మాన్య సులలితవన

రాజ(నైమిశ వనము)మచటను సురధేనురాజమొప్పె. -  దివిజ తేజోవిరాజియా దివ్యసురభి.     .

౨వ పద్యమగు సీస గర్భస్థ ఆటవెలది .

విశ్వమెల్ల పొగడు విలువల నేమంద్రు?

దధిని చిలుక వచ్చునది. యదేది?

చందమామ పయిన సతతమున్ గలదేది?

మనిషి నిల్చునెచట మసలుటకును.?

2 పద్యమగు సీస గర్భస్థ ఆటవెలది .

జ్ఞానముననునొప్పు జగతిలో నేజీవి?

జీవితమ్మున తుది చెలగునెద్ది?

ఉత్తరములు మూడు నొప్పగువర్ణముల్,

మొదటి వర్ణములను మునులు ప్రబలు

తే.గీ. గోమతీనది తీరాన కుంభినిపయి - నలరుచున్నట్టి సన్మాన్య సులలితవన

రాజమచటను సురధేనురాజమొప్పె. -  దివిజ తేజోవిరాజియా దివ్యసురభి.     .

ఈ౨వ పద్యమగు సీసమునందలి

ప్రశ్నలకు సమాధానములు సూచించిన ౪వ పద్యము తిలకించుడు.

. నైతిక మను మిసిమిఁ బడసె, - ఖ్యాతిగ హృది దధిని చిలుక, గగన శశభృతిన్

భాతిగ వెన్నెల కురియఁగ - భూతిని గనె వసుధ నరుఁడు. ముదిమిని మరిచెన్,     .

 

౫వ పద్యమగు చంపకమాలయందు గర్భితమైయున్న

అనేక కందములందు కొన్ని తిలకించుడు.

. అసమానమా గవిని

వ్యసరోవర కాంతులెన్నవా? మతి మసలన్

మసలున్ గదా! కవుల శే

ముషి కొల్పెడు కావ్య భాసమున్ కృతి వసుధన్.

. మసలన్ మహద్విరులు మౌ

నిసమీప్సిత వేద బోధనేక్షితి మసలున్

వసుధన్ గనన్ బ్రతుకు ప్రీ

తి సముద్ధతిఁ పంచు పెంచదే! ప్రతి నసమా!

. మసలున్ గదా! కవుల శే

ముషి కొల్పెడు కావ్య భాసమున్ కృతి వసుధన్.

అసమానమా గవిని

వ్యసరోవర కాంతులెన్నవా? మతి మసలన్

. వసుధన్ గనన్ బ్రతుకు ప్రీ

తి సముద్ధతిఁ పంచు పెంచదే! ప్రతి నసమా!

మసలన్ మహద్విరులు మౌ

నిసమీప్సిత వేద బోధనేక్షితి మసలున్

. అసమానమా గవిని

వ్యసరోవర కాంతులెన్నవా? మతి మసలన్.

మసలన్ మహద్విరులు మౌ

నిసమీప్సిత వేద బోధనేప్రతి నసమా!

. క్షితి మసలున్ గదా! కవుల శే

ముషి కొల్పెడు కావ్య భాసమున్కృతి వసుధన్

వసుధన్ గనన్ బ్రతుకు ప్రీ

తి సముద్ధతిఁ పంచు పెంచదే కృతి వసుధన్.

. మసలన్ మహద్విరులు మౌ

నిసమీప్సిత వేద బోధనేప్రతి నసమా!

అసమానమా గవిని

వ్యసరోవర కాంతులెన్నవా? మతి మసలన్.

. వసుధన్ గనన్ బ్రతుకు ప్రీ

తి సముద్ధతిఁ పంచు పెంచదే కృతి వసుధన్.

క్షితి మసలున్ గదా! కవుల శే

ముషి కొల్పెడు కావ్య భాసమున్కృతి వసుధన్

ఇలా చాలా కందాలు ఉన్నాయి పద్యంలో.

ఇక

౫వ పద్యము చంపకమాలలో ఉన్న తేటగీతి చూడండి.

గవిని భవ్యసరోవర కాంతులెన్

మౌనిసమీప్సిత వేద బోధ

కవుల శేముషి కొల్పెడు కావ్య భాస

బ్రతుకు ప్రీతి సముద్ధతిఁ పంచు పెంచ.

ఇక

సదమల సుచరిత కలిగిన

బుధునకు మనసు వెలుగు నుతముగ రవి కరణిన్.

సుధగవి కలుముల నిడుభువి

నది భవమగు చదివిన శుభ నయతలు గొలుపున్.     .

చతురంగ బంధ లఘు కందము.

పద్యము లఘు కందము. అనగా ౨వ ౪వ పాదాంత గురువు తప్ప

తక్కినచోట లఘువులే ఉండును.

పద్యమునకు సంబంధించిన చిత్రమును అచ్చటనే చూపియున్నాను.

ఇందుప్రత్యేకత ఏమిటనగా. చదరంగమున నాలుగు గుఱ్ఱములుండును

నాలుగు గుఱ్ఱములు వాటి స్థానములనుండి

నడిపిన వచ్చు మార్గములు నాలుగు కలిపి చూచినచో

పరమ పూజ్యమైన స్వస్తిక్ ఆకారము ప్రత్యక్షమగుటయే కాక

నాలుగు మార్గములలో ఏర్పడు ౪పాదముల కలయిక

ఒక పరిపూర్ణ అర్థ బోధకముగా నుండును.

అది ఎటులనగా

సురగవి - చదివిన - శుభములు - కలుగును

దీని అర్థము . . .

సురగవి అనేశీర్షికతోనొప్పు నవరత్నమాలిక చదివినచో

చదివినవారికి శుభములు తప్పక కలుగును. అని తెలుపుచున్నది.

ఇక

విరోధాభాసాలంకృత చంపకమాల.

సురగవి కల్గినన్ ధరణి శోభిలు పాపుల దుష్ట చేష్టలన్,

పరిహరణంబు సేయు వర భక్త శిఖామణులన్, మహాత్ములన్,

సురుచిర కావ్యముల్ వెలయు  జూదరపాళి దురోదరాళిచేన్,

బురసతి బాధలొందు నటు బుద్ధికి కానఁగరావసంగతుల్.     .

పద్యమున ఏపాదమునకాపాదమున మనకు వ్యతిరేకార్థము ద్యోతకమగుచుండును.

కాని

కొంచెము నిశితముగా పరిశీలించి వెనుకముందులు కలిపి చదివినచో,

వాక్యములు సరియగుచోట విరిచినచో యదార్థము సత్యసమ్మతము గోచరించును.

అందువలననే ఇది విరోధాభాస అలంకార చంపకమాల అయినది.

నమస్తే.చింతా రామ కృష్ణా రావు. M.A., కృతికర్త

విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.

1) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

2) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

3) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

4) అశ్వధాటి సతీ శతకము.(ఒక్క రోజులో ప్రాస నియమముతో, ప్రతీపాదమునా

    మూడు ప్రాసయతులతో వ్రాసినది.)

5) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

6) వసంతతిలక సూర్యదేవ శతకము.

7) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

8) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

9) శివ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

10) శ్రీ అవధాన శతపత్ర శతకము.

11) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

12) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత 118    

       ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)

13) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

14) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము.(బంధచిత్రకృతి ఒకే

       శతకమున మూడు మకుటములతో మూడు శతకములు.)

15) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

16) విజయభావన శతకము.

17) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

18) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి

      పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల

     నక్షత్రమాల.)

19) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

20) నేరెళ్ళమాంబ సుప్రభాతము.

21) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

22) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

23) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

24) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

25) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

26) రుద్రమునకు తెలుగు భావము.

27) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు  

       పద్యానువాదము.

28) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మార్చన.

29) బాలభావన శతకము.

30) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగుల నిర్వహణ.

31) భగవద్గీత …    తెలుఁగుపద్యానువాదము.

32. శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మరచన.

33. ౨౨౦౦. అనంత ఛందము కొరకు శతకము.

34. స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక 

35. వేదప్రశస్తి.  నక్షత్రమాలిక.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.