గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జనవరి 2023, మంగళవారం

యస్య నాహంకృతో భావో - ...18 - 17...//... జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా - ...18 - 18,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

 జైశ్రీరామ్.

శ్లోయస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య లిప్యతే|

హత్వాऽపి ఇమాఁల్లోకాన్న హన్తి నిబధ్యతే. || 18-17 ||

తే.గీ. ఎవ డహంబును వీడునో, యెవని బుద్ధి

కర్మలం దగల్కుండునో, గణ్యుడయిన

యట్టివాడు లోకుల జంప, నంటనేర

దట్టి కర్మఫలంబెన్న నతనికిలను.

భావము.

ఎవరిలో అహంకారం లేదో, ఎవరి బుద్ధి కర్మలో తగుల్కోదో, అతడు 

లోకులను చంపినా, చంపినవాడు కాదు. బంధనంలో చిక్కుకోడు.

శ్లోజ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా|

కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః. || 18-18 ||

తే.గీ. జ్ఞాత, జ్ఞానమున్ జ్ఞేయము, కర్మకెపుడు

ప్రేరణము గొల్పుచుండును,వినుము పార్థ!

యింద్రియము, కర్త, కర్మయు, నిట్టి కర్మ

నిర్వహించుచునుండును, నిజము కనుము‌.

భావము.

జ్ఞానమూ, తెలుసుకోవలసిన విషయమూ, తెలుసుకునే వాడూ, మూడూ కర్మని 

ప్రేరేపించేవి. ఇంద్రియం, కర్మ, కర్మ చేసినవాడు, మూడూ కర్మని నిర్వహించేవి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.