గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జనవరి 2023, మంగళవారం

పఞ్చైతాని మహాబాహో - ...18 - 13...//... అధిష్ఠానం తథా కర్తా కరణం - ...18 - 14,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

 జైశ్రీరామ్.

శ్లోపఞ్చైతాని మహాబాహో కారణాని నిబోధ మే|

సాఙ్ఖ్యే కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్. || 18-13 ||

తే.గీకర్మలేవైన సిద్ధింప కావలె భువి

నైదు కారణముల్, విను మర్జునుండ!

సాంఖ్యసిద్ధాంతమునుబట్టి సన్నుతముగ

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

మహానుభావా సాంఖ్య సిద్ధాంతంలో కర్మలైనా సరే సిద్ధించడానికి 

అయిదు కారణాలు కావాలని చెప్ప బడినాయి. వాటిని గురించి 

విను.

శ్లోఅధిష్ఠానం తథా కర్తా కరణం పృథగ్విధమ్|

వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పఞ్చమమ్. || 18-14 ||

తే.గీ. కన నధిష్టాన దేహంబు కర్మకర్త,

జ్ఞాన కర్మేంద్రియమ్ములు, ఘనతరమగు 

లబ్ధ ప్ర్రారబ్ధ మీ యైదు రమ్యగతిని

సర్వ కర్మసిద్ధికి వలెన్ సరసహృధయ!

భావము.

అధిష్టానమైన శరీరం, కర్మ చేసే వాడు, వేర్వేరు ఇంద్రియాలు

కర్మేంద్రియాలుప్రారబ్ధం 

అయిదూ(సర్వ కర్మ సిద్ధికి కారణాలు)

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.